నరసింహన్‌ను పెద్దమనిషిగా తాను చూశానని, ఆయన కూడా తనను సీఎంలా కాకుండా తమ్ముడిలా ఆదరించారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పారు. తాను తొలినాళ్లలోనే ఆయనపై విశ్వాసం వ్యక్తంచేశాను అని సీఎం గుర్తుచేసుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదాల పరిష్కారానికి చొరవ చూపారని సీఎం తెలిపారు. ప్రభుత్వ పథకాల మంచిచెడులను ఎప్పటికప్పుడు చర్చించేవారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వాకబుచేసేవారు. నేను తల్లిదండ్రులను కోల్పోయాను. పెద్దన్న లేడు. పెద్దల ఆశీర్వాదం తీసుకొని మంచిపనికి శ్రీకారం చుట్టాలని భావించాను. నాకు గవర్నర్ దంపతులే పెద్దదిక్కుగా కనిపించారు. సోదరభావంతో వారికి పాదాభివందనంచేసి పని ప్రారంభించాను. అది విజయవంతంగా కొనసాగుతున్నది.



ప్రగతిభవన్‌లో గవర్నర్ నరసింహన్‌కు ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు సభ సీఎం కేసీఆర్ మాట్లాడారు. శనివారం ఈఎస్‌ఎల్ నరసింహన్‌ రాష్ట్ర గవర్నర్‌ బాధ్యతల నుంచి వైదొలిగారు. గడిచిన తొమ్మిదిన్నసంవత్సరాల కాల వ్యవధిలో  మొదట ఉమ్మడి ఏపీ గవర్నర్‌గా, తర్వాత రెండు రాష్ట్రాల గవర్నర్‌గా, చివరికి తెలంగాణ గవర్నర్‌గా నరసింహన్ మూడు రకాల బాధ్యతల్ని నిర్వర్తించారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో మాజీ ఐపీఎస్ అధికారి అయిన నరసింహన్ గవర్నర్‌గా వచ్చా రు. ఈ సందర్బంగా  రాష్ట్ర ప్రభుత్వం సముచితమైన గౌరవమర్యాదలతో వీడ్కోలు పలికింది. ఈ క్రమంలో   ప్రభుత్వం బేగంపేట  విమానాశ్రయంలో గార్డ్ ఆఫ్ ఆనర్ ను ఏర్పాటు చేసింది.  అంతకుముందు కేసీఆర్ మాట్లాడుతూ. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, రాష్ట్ర అవతరణ, కొత్త రా ష్ట్రం ప్రస్థానం పూర్తిగా తెలిసిన గవర్నర్ గా నరసింహన్ సేవలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు.




ఇద్దరి మధ్య అనేక గొప్ప జ్ఞాపకాలున్నాయి. నరసింహన్‌కు ఇచ్చినట్లే వచ్చే గవర్నర్‌కు కూడా అదే గౌరవమిస్తామని, రాజ్‌భవన్ ప్రాశస్త్యాన్ని కాపాడుతామని సీఎం తెలిపారు. రాష్ట్ర కొత్త గవర్నర్‌గా డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయనున్నట్టు తెలిపారు.  తమిళిసై ఉదయం 9 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడినుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వచ్చి పోలీసుల గౌరవవందనం స్వీకరిస్తారని చెప్పారు/ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ తమిళిసైతో ప్రమాణం చేయిస్తారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు హాజరవుతారని రాజ్‌భవన్ అధికారులు తెలిపారు.



నరసింహన్ మాట్లాడుతూ.. కేసీఆర్‌కు ప్రజలనాడి తెలుసు. వారి కష్టాలు తెలుసు. అందుకే అయన తెచ్చిన అనేక పథకాల్లో మానవ త్వం ఉన్నది. మా మధ్య మొదట్నుంచీ ఉన్నది పరస్పర నమ్మకమే.   పెద్దలను గౌరవించడం, కష్టాల్లో ఉన్నప్పుడు మానవత్వం చూపడం, నమ్మకం నిలబెట్టుకోవడం ముఖ్యమంత్రి కేసీఆర్‌లో నాకు కనిపించాయి.   కేసీఆర్ తెచ్చిన అనేక పథకాల్లో మానవ త్వం ఉన్నది.స్వయంగా కంప్యూటర్ ఆపరేట్‌చేసి, స్క్రీన్‌పై పథకాల గురించి వివరించిన ముఖ్యమంత్రిని కేసీఆర్ నే చూశానన్నారు. ఆయనతో కలిసి పనిచేయడం వల్ల చాలా నేర్చుకున్నానని నరసింహన్ పేర్కొన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: