కొత్తవాహన చట్టం ప్రకారం రూల్స్ అతిక్రమించే వాహనాలకు విధించే చలానాలు భారీ మొత్తంలో ఉండటంతో పాపం వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.  అప్పోసొప్పో చేసి వాహనం కొనుగోలు చేసిన వాహనదారుడు సరదాగా అలా బయటకు వెళ్లాలంటే ఇప్పుడు ప్రభుత్వం విధించే చలానాలు గుర్తుకు వచ్చి భయం వేసి బయటకు వెళ్లడం మానేశాడు. అంతేకాదు, ఒకవేళ బయటకు వెళ్ళాలి అంటే అన్ని సక్రమంగా ఉండాలి.  


అన్ని సక్రమంగా ఉన్నా ఒక్కోసారి ఏదైనా తేడా వచ్చి పొరపాటున పట్టుబడితే.. ఉన్నవి వదిలించుకోవాల్సి వస్తుంది.  అందుకే అన్ని ఉండేంత వరకు బయటకు వెళ్లకుండా సైలెంట్ గా ఇంట్లోనే కూర్చుంటున్నాడు.  ఏదైనా అర్జెంట్ అని బయటకు వెళ్లాలన్న అదే భయం.  సామాన్యుల నడ్డి విరగ్గొట్టే విధంగా చలానాలు ఉన్నాయని చాలామంది విమర్శిస్తున్నారు.  అంతేకాదు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో దొరికిన వ్యక్తులకు విధించే చలానాలు భారీగా పెరిగిపోతున్నాయి.  


మద్యం తాగమని మద్యం షాపులు పెడుతున్నది ప్రభుత్వం.  మద్యం తాగి ఇంటికి వెళ్తుంటే పట్టుకొని ఫైన్ వేస్తున్నది కూడా అదే ప్రభుత్వం.  తాగమని చెప్పేది ప్రభుత్వమే.. తాగాక ఫైన్ వేసేది ప్రభుత్వమేనా అని ప్రశ్నిస్తున్నారు.  అసలు మద్యం బ్యాన్ చేస్తే ఈ ఇబ్బందులు ఉండవు కదా. మద్యం సేవించి ఇంటికి వెళ్ళాలి అంటే భయపడతారు.  అలాంటప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉండవు.  ప్రభుత్వం అనుకున్నట్టుగా స్వచ్ఛంగా ఉంటుంది.  


లేదంటే మద్యం అమ్మకాలు ప్రభుత్వం తీసుకొని ఫలానా సమయంలో మాత్రమే అమ్మకాలు ఉంటాయి అని చెప్పాలి.  ఆ సమయం దాటి దొరికితే ఫైన్ అని ప్రకటించాలి.  అప్పుడు క్రమంగా మార్పు వస్తుంది.  అంతేకాని, ఈ స్థాయిలో చలానాలు వసూలు చేస్తుంటే.  చలానా కట్టి మిగతా రోజులు ఇంట్లో పస్తులు ఉండాల్సి వస్తుందని సామాన్య ప్రజలు వాపోతున్నారు.  కొంతమంది నాయకులు కూడా ఇదే వాదనను వినిపిస్తున్నారు.  చలానాలు వసూలు చేయడం మంచిదే.  ట్రాఫిక్ రూల్స్ ను ఇప్పటి వరకు పాటించని చాలామంది ఇప్పుడు రూల్స్ ను పాటిస్తున్నారు.  వేగాన్ని అతిక్రమించకుండా వాహనాలు నడుపుతున్నారు.  ఎందుకో తెలుసా చలానాలకు భయపడి. తగ్గించిందని ప్లీజ్ అని పాపం సామాన్యులు వేడుకుంటారన్నారు.  భవిష్యత్తులో చలానా కట్టలేక ఆత్మహత్య అని పేపర్లో చదవాల్సి వస్తుందేమో.  


మరింత సమాచారం తెలుసుకోండి: