ప్రదేశ్ మంత్రి బొత్ససత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యల్లో ఎప్పుడు ముందు వరుసలో ఉంటూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజా గా మంత్రి గారు  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై మళ్ళీ సంచలనమైన వాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ఏదైనా గెజిట్ నోటిఫికేషన్ లాంటిది విడుదల చేశారా అని ప్రశ్నించారు. అంతే కాకుండా రాజధాని అమరావతి అనేది కేవలం తాత్కాలికమే అని బొత్స కుండా బద్దలు కొట్టి చెప్పి మరొక సంచలనానికి తెరతీశారు.

 

 

ప్రస్తుతానికి నిర్మిస్తున్నటువంటి నిర్మాణాలు కూడా తాత్కాలికమే కావడంతో, తానూ చేసిన వాఖ్యలు కూడా ఎలాతని తప్పులు లేవని, అమరావతి కూడా తాత్కాలికమే అనడంలో ఎలాంటి తప్పు లేదని బొత్స అన్నారు. ఇకపోతే గత ప్రభుత్వ హయాంలో అధికారంలో  ఉన్నటువంటి చంద్రబాబు రాజధానికి ఎలాంటి అడ్రస్ లేకుండా చేశారని, చంద్రబాబు వల్లే ఆంధ్రప్రదేశ్ కి ఇలాంటి నీచమైన దుస్థితి పట్టిందని, అలంటి పరిస్థితి నుండి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపాడాలని ప్రయత్నిస్తున్నారని కాపాడాలగలరని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

 

 

అంతేకాకుండా ఇటీవల జనసేన అదినేత పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యలపై స్పందించిన బొత్స, మా పనులు మాకు తెలుసనీ, ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఎలా ఉండాలో ఒకరు చెప్తే తెలుసుకునేంత దౌర్భాగ్య స్థితిలో తమకు లేమని బొత్స వాఖ్యానించారు. అందులో ఏమాత్రం అనుభవం లేని పవన్ కళ్యాణ్ మంత్రి ఎలా ఉండాలో ఎలా చెప్తారని ఎద్దేవా చేసారు. తాజాగా జగన్ తుగ్లక్ అంటూ ,చంద్రబాబు తనయుడు లోకేష్ చేసిన వాక్యాలను కూడా మీ నాన్నదే  తుగ్లక్ పాలనా అటు తిప్పి కొట్టారు.

 

 

ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై చేసిన వాఖ్యలు ఎంతటి సంచలనాలను సృష్టించాయి మనందరికీ తెలుసు, కాగా మళ్ళీ ఈ తాజాగా చేసిన వాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: