ప్రముఖ న్యాయవాది ఇక లేరు. ఆయన వాగ్దాటి ఒక్కసారిగా మూగపోయింది.  రాం జెఠ్మలానీ మరణ వార్త తెలిసిన వెంటనే కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా హుటాహుటిన వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళిలు అర్పించారు.  ప్రస్తుత పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌, శిఖర్‌పూర్‌లో 1923 సెప్టంబర్ 14న జన్మించిన ఆయన దేశ విభజన తర్వాత భారత్ వచ్చారు. రాం జెఠ్మలానీ అబద్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  వై ఎస్ జన్మోహాన్ రెడ్డి కేసులు సహా దేశంలోని వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టులో ఎన్నో హై-ప్రొఫైల్ కేసులు వాదించారు. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ హంతకుల తరఫున, స్టాక్ మార్కెట్ కుంభకోణాల నిందితులు హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ తరఫున.. అఫ్జల్ గురు తరఫున ఆయన వాదించారు. బీజేపీ తరఫున రెండుసార్లు ముంబయి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.





మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో న్యాయ శాఖ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా పని చేసారు. అనంతరం ఆయన  2004లో లఖ్‌నవూలో వాజపేయిపైనే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 17 ఏళ్ల వయసుకే లా డిగ్రీ అందుకున్న రాం జెఠ్మలానీ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. 1959లో నానావతీ కేసులో జెఠ్మలానీ తన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆయన క్రిమినల్ లా ప్రాక్టీస్ ప్రముఖులుగా  ఖ్యాతి చెందారు. జెఠ్మలానీకి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 



జెఠ్మలానీ కుమారులలో ఒకరు మహేశ్ జెఠ్మలానీ, రాణీ జెఠ్మలానీలు. ఈ ఇరువురు ప్రముఖ న్యాయవాదులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర  మోదీకి మొదట మద్దతు ఇచ్చిన  జెఠ్మలానీ ఆ తర్వాత తీవ్రంగా వ్యతిరేకించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాం జెఠ్మలానీ మొదట నరేంద్ర మోదీ ప్రధాని కావడాన్ని సమర్థించారు. అయితే మోదీ ప్రధాని అయిన తర్వాత త్వరలోనే ఆయనకు వ్యతిరేకం అయ్యారు. 2015లో అరుణ్ జైట్లీ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై పరువునష్టం దావా వేసినపుడు, జెఠ్మలానీ కేజ్రీవాల్ వైపు నిలిచారు. ఓటమి తెలియని న్యాయవ్యాధి ఇకలేరు.అయన మరణంతో న్యాయవాద వర్గాల్లో తీవ్ర నిరాశ నిసృహాలు నెలకొన్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: