సాధారణంగా ఎవరైనా దొంగతనం చేస్తే.. పిక్ పాకెట్ కేసు కింద రెండు మూడు రోజులు జైల్లో పెడతారు.  లేదంటే ఓ వారం రోజులు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.  అలా కాకుండా.. 3500 రూపాయలు దొంగతనం చేసిన నేరానికి 36 సంవత్సరాలు జైలు శిక్ష వేయడం ఎక్కడైనా చూశారా. అలా కూడా జైలు శిక్ష వేస్తారా అని షాక్ అవ్వకండి.  అలా వేయాల్సి వచ్చిందట.  అయితే, ఇది జరిగింది ఇక్కడ కాదు.  అమెరికాలో.  


అమెరికాలోని అలబామా కు చెందిన కెల్విన్ అనే వ్యక్తి వయస్సు ప్రస్తుతం 56 సంవత్సరాలు.  తనకు 20 సంవత్సరాల వయసులో ఉండగా అంటే 1983 వ సంవత్సరంలో కెల్విన్ ఓ బేకరీలో 50 డాలర్లు దొంగతనం చేశాడు.  దొంగతనం చేసి పారిపోతూ పోలీసులకు చిక్కాడు. అనంతరం ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లారు.  ఈ కేసులో అరెస్టయిన అల్విన్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. అప్పట్లో అమల్లో ఉన్న హ్యాబిట్ల్ ఫెలోను ఆఫెండర్ ఆక్ట్ ప్రకారం కోర్టు అల్విన్‌కు ఈ శిక్ష విధించింది. ఈ చట్టానికి ‘త్రీ స్ట్రైక్స్ లా’ అనే పేరు కూడా ఉంది. దీని ప్రకారం.. ఒక వ్యక్తి పదే పదే నేరాలు చేస్తున్నట్లయితే.. అతడికి మూడు రెట్లు అధిక శిక్ష విధించాలనేది నిబంధన అమల్లో ఉన్నది.  


ఆల్విన్ 1983 కు ముందు 1979 లో మూడు దొంగతనాలు చేసి అరెస్ట్ అయ్యాడు.  అప్పట్లో కోర్టు ఆయనకు మూడేళ్ళ శిక్షను విధించింది.  ఈ శిక్షను అనుభవించి బయటకు వచ్చిన కెల్విన్ పాత అలవాట్లను మానుకోలేదు.  తిరిగి దొంగతనం చేయడం మొదలుపెట్టాడు.  ఆలా దొంగతనం చేస్తూ 1983 లో పట్టుబడ్డాడు.  దీంతో  త్రీ స్ట్రైక్స్ లా ప్రకారం అతనికి జీవిత ఖైదు విధించింది.  కాగా గత 36 సంవత్సరాలుగా కెల్విన్ జైలులో ఉన్నాడు. 
జైలులో మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడని, అతన్ని రిలీజ్ చేయాలనీ కోరుతూ జైలు అధికారులు కోర్టును కోరారు.  కోర్టు కూడా అందుకు సమ్మతించింది.  జైల్లో ఉన్నప్పటి నుంచి అయన కార్పెంటర్ గా పనిచేస్తూ వస్తున్నారు.  తాను తప్పు చేశానని, ఇంకెప్పుడు ఆ తప్పు చేయనని, తనను వదిలిపెట్టాలని కెల్విన్ కోర్టును వేడుకున్నాడు.  కోర్టుకూడా అతని అభ్యర్ధనను మన్నించింది.  


కోర్టు అతని అభ్యర్ధనను మన్నించే ముందు కోర్టు వీక్షకుల అభిప్రాయం కూడా తెలుసుకున్నది.  వాళ్ళు కూడా కెల్విన్ ను వదిలివేయాలని చెప్పడంతో సానుకూలంగా స్పందించింది.  కోర్టు తీర్పు అనుకూలంగా ఉన్నా.. ఇప్పటి వరకు ఆయన ఇంకా విడుదల కాలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: