కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్, కుంతియాలపై సంచలన వ్యాఖ్యలు చేసారు. వీరిద్దరూ రాజీనామా చేస్తేనే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుందని వ్యాఖ్యలు చేశారు. చేతులు కాలాక పీసీసీ పదవులు అవసరం లేదని వ్యాఖ్యలు చేశారు. టీఆర్ ఎస్ కు ఎప్పటికైనా ప్రత్యామ్నాయం బీజేపీనేనని తెలంగాణ రాష్టంలో బీజేపీ పుంజుకుంటుందని అన్నారు. 
 
ఉత్తమ్, కుంతియా వలనే రాష్ట్రంలో పార్టీ బలహీనపడుతుందని కోమటిరెడ్డి అన్నారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేదని అలాంటపుడు కింది స్థాయిలో పీసీసీ ఎవరు అయితే ఏమిటని కోమటిరెడ్డి అన్నారు. పాదయాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా కేసీయార్ వినే పరిస్థితిలో లేరని కోమటిరెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి దక్కుతుందనటం కూడా కేవలం సోషల్ మీడియా ప్రచారం మాత్రమేనని అన్నారు. 
 
ఎవరి మీడియా వారికి ఉందని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. పీసీసీ రేసులో ఎవరు ఉన్నా ఎలాంటి ఫలితం ఉండదని అన్నారు. ఉత్తమ్, కుంతియా వ్యవహారశైలి వలనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇంత ధీన స్థితిలో ఉంది. పార్టీ నుండి వారిద్దరినీ పంపిస్తే మాత్రమే పార్టీకి మంచి రోజులొస్తాయి. మోడీ నాయకత్వాన్నే దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారని కోమటిరెడ్డి అన్నారు. 
 
బీజేపీ పార్టీలో చేరితేనే సరైన నాయకత్వం లభిస్తుంది. నా నియోజకవర్గానికి చెందిన ప్రజలకు మేలు చేయటం కొరకు మాత్రమే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని లేదంటే బీజేపీ పార్టీలో ఎప్పుడో చేరేవాడినని అన్నారు. కొన్ని కారణాల వలన బీజేపీ పార్టీలో చేరలేకపోతున్నాను. కాంగ్రెస్ పార్టీకి దేశంలో, రాష్ట్రంలో మనుగడ లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి పదవి వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారని కానీ పదవి రావటం రేవంత్ ఊహేనని కోమటిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: