ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంపై జ‌గ‌న్ స‌ర్కారు త‌న‌దైన శైలిలో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే అక్క‌డి భూమి నిర్మాణాల‌కు నాణ్య‌తాప‌రంగా స‌రిపోద‌ని, ల‌క్ష రూపాయ‌లు అయ్యే నిర్మాణానికి రెండు రెట్లు ఎక్కు వ‌గా ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తుంద‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ బాంబు పేల్చారు. ఈ ప్ర‌భావం ఇప్ప‌టికీ క‌నిపిస్తోంది. విప‌క్షాలు దీనిపై రాద్ధాంతం చేస్తూనే ఉన్నాయి. సీఎం జ‌గ‌న్ దీనిపై స్పందించాల‌ని డిమాండ్లు కూడా పెరిగాయి. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు జ‌గ‌న్ దీనిపై స్పందించ‌లేదు.


అయితే, విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం జ‌గ‌న్ ప్ర‌భుత్వం రాజ‌ధానిపై వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోం ది. తాజాగా అందిన స‌మాచారం ప్ర‌కారం.. అన్ని ప్రాంతాల‌ను అభివృద్ధి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా జ‌గ‌న్ స‌ర్కారు మాస్ట‌ర్ ప్లాన్ రెడీ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే.. రాజ‌ధాని పేరు కూడా మార్చాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. ఇక‌, ప్ర‌భుత్వ పాల‌న‌ను కేవ‌లం రాజ‌ధానికి మాత్ర‌మే ప‌రిమితం చేసి.. ప్ర‌భుత్వ విభాగాలైన పారిశ్రామిక రంగం, విద్య‌, ఐటీ, శాంతి భ‌ద్ర‌త‌లు వంటివాటిని వివిధ జిల్లాల‌కు త‌ర‌లించేలా ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించుకుంది.


అదే స‌మ‌యంలో భూముల ధ‌ర‌లు త‌గ్గిపోకుండా చ‌ర్య‌లు తీసుకునేందుకు కూడా సిద్ధ‌మైంద‌ని తెలుస్తోంది. దీనిలో భాగంగా.. విజ‌య‌వాడ-మంగ‌ళ‌గిరి హైవేపై నిర్మాణాల‌ను పెంచాల‌ని త‌ద్వారా రియ‌ల్ ఎస్టేట్ రంగం దెబ్బ‌తిన‌కుండా చూడాల‌ని నిర్ణ‌యించుకుంది. ఇక‌, వెనుక బ‌డిన ప్రాంతాలుగా ఉన్న దొన‌కొండ త‌దిత‌ర ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాల ని మాస్ట‌ర్ ప్లాన్ రెడీ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. అదేవిధంగా విశాఖ‌ను ఐటీ హ‌బ్‌గా మార్చాల‌ని నిర్ణ‌యించుకుంది.


అమ‌రావ‌తి పేరుకు సంబంధించి గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఎలాంటి గెజిట్ నోటిఫికేష‌న్ కూడా జారీ చేయ‌లేదు. దీంతో ఇప్పుడు ఈ పేరును కూడా మార్చి.. తాజాగా గెజిట్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయాల‌ని జ‌గ‌న్ ప్ర‌బుత్వం నిర్ణ‌యించుకుంది. అదేస‌మ‌యంలోరాజ‌ధాని నిర్మాణాల‌కు సంబంధించి చంద్ర‌బాబు వ్యూహాల‌ను ప‌క్క‌కు పెట్టి.. ఆయ‌న వాస‌న‌లు కూడా లేకుండా చేయ‌డం ద్వారారాజ‌ధానిపై త‌న‌దైన శైలిలో ముద్ర వేయాల‌ని జ‌గ‌న్ స‌ర్కారు భావిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: