ఏదైనా సరే శృతిమించితే తీగలు తెగిపోతాయి.  తరువాత అతికించుకోవడానికి కూడా కుదరదు.  ఒక మనిషిపై భారం పెరిగితే ఒత్తిడికి లోనై ఇబ్బందులు పడతాడు.  చివరికి ఆత్మహత్య చేసుకునేదాకా వెళ్తుంది.  ఒక వాహనంపై భారం ముందుకు కదలదు.  ఒక ఇంటికేపై భారం పెరిగితే కూలిపోతుంది.  రాష్ట్రం, దేశంపై భారం పెరిగితే అభివృద్ధి కుంటుపడుతుంది.  


అదే ప్రపంచంపై భారం పెరిగితే యుద్దాలు వస్తాయి.  మరి భూమిపై భారం పెరిగితే ఏం రావాలి.  ఎలా ఆ భారాన్ని తగ్గించుకోవాలి.  అందుకే ప్రకృతి విలయాలు వస్తున్నాయి.  వరద రూపంలో ప్రకృతి కోపాన్ని ప్రదర్శిస్తోంది.  అడవులు దహనం రూపంలో, భూకంపాల రూపంలో భూమి తన భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నది.  ఇది నిజమే కదా.  పూర్వకాలంలో విపత్తులు చాలా తక్కువగా వచ్చేవి.  


అప్పట్లో ప్రకృతి సమతుల్యతతో ఉండేది.. కాబట్టి పెద్దగా ఇబ్బందులు ఉండేవి కాదు.  కానీ, ఇప్పుడు అంతా మారిపోయింది.  జనాభా ఇబ్బడిముబ్బడిగా మారిపోయింది.  చెట్లు నరికేస్తున్నారు.  దీంతో భూతాపం పెరిగిపోతున్నది.  భూమిలోపక వేడి పెరిగిపోతున్నది.  వేడి విపరీతంగా పెరిగిపోవడం కారణంగా భూమిలో ఉండే పొరలు దెబ్బతింటున్నాయి.  ఫలితంగా భూకంపాలు వస్తున్నాయి.  


తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో ఎప్పుడూ లేని విధంగా ఐదుసార్లు భూమి కంపించింది.  ముఖ్యంగా చంబా జిల్లాలో ఈ సంఘటన జరిగింది.  జమ్మూ కాశ్మీర్ బోర్డర్ లో ఉన్న ఈ జిల్లాలోని చాలా ప్రాంతాలలో భూమి కంపించడం విశేషం.  వరసగా ఇలా భూమి కంపించడంతో అక్కడి ప్రజలు భయబ్రాంతులకు లోనయ్యారు.  రాత్రి నిద్రలేకుండా రోడ్లమీదనే జాగారం చేశారు.  ఇలా హిమాచల్ ప్రదేశ్ లో ఒక్క రోజులోనే ఐదుసార్లు భూమి కంపించడం ఇదే మొదటిసారి.  అయితే, ఈ భూకంపం వలన ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.  ముందుజాగ్రత్తగా హెచ్కరించడంతో ప్రజలు బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: