ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం లక్ష్యం దిశగా సాగుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును చూసేందుకు రైతులు భారీగా తరలివస్తున్నారు. ఎస్సారెస్పీ మూడో పంప్ హౌస్ పనులను మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించనున్నారు. ముఖ్యమంత్రి కలలు కన్న రోజు రానే వచ్చింది . 2017 ఆగష్టు 10 వ తేదీన ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకానికి శంకుస్థాపన జరిపింది. 1050 కోట్ల రుపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టారు. ప్రాజెక్టు ఖర్చు 1700 కోట్ల రుపాయలకు పెరిగింది కానీ రెండేళ్ళ క్రితం ప్రారంభించిన ఈ పథకం ఎట్టకేలకు పూర్తయింది. ఎస్సారెస్పీ పుడమితల్లిని కాళేశ్వరం గంగ ముద్దాడింది. ఎల్లంపల్లి నుంచి 102 కిలోమీటర్ల దూరం వరద కాలువ ద్వారా నీటిని తరలించే ప్రక్రియ విజయవంతంగా జరిగింది. 
 
రామ్ పూర్ వద్ద, రాజేశ్వరరావు పేట వద్ద ఉన్న రెండు పంప్ హౌస్ ల వద్ద రెండు మోటార్లు నీటిని దిగ్విజయంగా ఎత్తిపోస్తున్నాయి. ఎస్సారెస్పీకి ఇదే ప్రధానమైన వరద కాలువ అని చెప్పవచ్చు. ఈ వరద కాలువ ద్వారానే కాళేశ్వరం నుండి రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని తరలించటం జరిగింది. ఎస్సారెస్పీకి చాలా రోజుల నుండి వరద నీరు రావటం తగ్గుముఖం పట్టింది. పూర్తిస్థాయిలో నీరు నిండటం ఒక కలగా మారింది. 
 
ఈ ప్రాజెక్ట్ 19 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తుంది. ఆరు జిల్లాలకు తాగునీటిని అందిస్తుంది. పూర్వ వైభవం కోల్పోయిన ఎస్సారెస్పీ పునరుజ్జీవనం పేరుతో సక్సెస్ చేయటం జరిగింది. ప్రతిరోజు ఒక టీఎంసీ చొప్పున 60 రోజులు 60 టీఎంసీలు నింపే ఉద్దేశంతో ఈ పథకానికి రూపకల్పన చేశారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుండి దిగువకు నీరు వెళ్ళటమే చూసాము కానీ శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ నుండి ఎగువకు నీరు రావటం అనేది అద్భుతం అని రైతులు చెబుతున్నారు. 
 
రైతు సమన్వయ కమిటీ సభ్యురాలు మాట్లాడుతూ సీఎం గారి కృషి వలన ఇంత తక్కువ సమయంలో ఈ ప్రాజెక్ట్ పూర్తయింది. ప్రస్తుతం మాకు ఎటువంటి సమస్యలు లేవు. రైతులను ఆదుకుంటున్న సీఎంకు కృతఙతలని అన్నారు. మరో రైతు మాట్లాడుతూ శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు నీరు రావటం ఆనందించించదగిన విషయమని అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: