టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి భారతీయ జనతా పార్టీ (బిజెపి) లో చేరనున్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, రెడ్డి ఇలా అన్నారు: "నేను దేశభక్తి గల వ్యక్తిని. బిజెపితో మాత్రమే చేతులు కలపడానికి ఇష్టపడతాను. పైగా ఇది కడప జిల్లా అభివృద్ధి కోసం," అన్నారు. 

 

 
గత సార్వత్రిక ఎన్నికలలో అభ్యర్థుల ఎంపికపై టిడిపి హైకమాండ్‌ను రెడ్డి విమర్శించారు. "టిడిపి ఆశించినట్టుగా సరిగ్గా అభ్యర్ధులను ఎంపిక చేయకపోవడం వల్ల నేను పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయాను. బిజెపిలో చేరడానికి నాతో పాటు ఎవరు వస్తారో నాకు తెలియదు. అయితే, నేను బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నాను, ఇది నా స్వంత నిర్ణయం.”  మిస్టర్ రెడ్డి త్వరలోనే నియోజకవర్గంలో తన అనుచరులు మరియు మద్దతుదారులను కలవనున్నారు. ఈ సమావేశం తరువాత, రెడ్డి కుంకుమ పార్టీలో ఎప్పుడు చేరాలో నిర్ణయిస్తారు. 

 

 
ఆదినారాయణ రెడ్డి లెక్చరర్‌గా మారిన రాజకీయవేత్త. 1994 లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన, కాంగ్రెస్ టికెట్‌పై జమ్మలమదుగు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేశారు. కానీ, టిడిపికి చెందిన పి రామసుబ్బారెడ్డి చేతిలో ఓడిపోయాడు. పైగా 1999 ఎన్నికలలో గెలవలేకపోయాడు. ఇక మళ్ళి రెండవసారి రామసుబ్బ రెడ్డి చేతిలో ఓడిపోయాడు.  

 

 
2004 మరియు 2009 ఎన్నికలలో, రెడ్డి కాంగ్రెస్ టిక్కెట్ పై , ఆ తరువాత 2014 లో వైయస్ఆర్సిపి టికెట్ పైన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, తరువాత టిడిపిలో చేరి క్యాబినెట్ బెర్త్ పొందారు. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా కడప లోక్‌సభలో పోటీ చేసి వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి అవినాష్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. టిడిపిలో ఉన్నప్పుడు, రెడ్డి వైయస్ఆర్సిపి నాయకులను విమర్శించేవారు. వైఎస్‌ఆర్‌సిపి ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టినప్పటి నుంచి రెడ్డి బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: