ఆత్మకూరు గ్రామం ప్రశాంతంగా ఉందని, ఎవరి పనులు వారు ప్రశాంతంగా చేసుకుంటున్నారని ఇలాంటి సమయంలో చంద్రబాబు అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడని గ్రామస్థులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బంధువుల మధ్య తగాదాలను పార్టీల మధ్య తగాదాలుగా సృష్టిస్తూ చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. 
 
గ్రామం నుండి ఎవరూ ఎవరిని బహిష్కరించకపోయినప్పటికీ టీడీపీకి చెందిన వారే తమలో తాము గొడవపడ్డారని చెబుతున్నారు. ఒక కుటుంబంలో జరిగిన గొడవలను ఊరి గొడవగా సృష్టించాలని అనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం సమయంలో పోలీసులు కేసులు తీసుకునే వారు కాదు. పొలాలు కూడా లాక్కున్న ఘటనలు ఉన్నాయి. పది మంది పదిహేను మంది మగవారు శిబిరంలో ఉన్నారని వారు ఎందుకు అక్కడికి వెళ్ళారో తెలియదని గ్రామానికి చెందిన వ్యక్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
కుటుంబ తగాదాల్ని పార్టీ తగాదాలుగా సృష్టించవద్దని గ్రామస్థులు కోరుకుంటున్నారు. ఇరు వర్గాల మధ్య ఎటువంటి గొడవలు లేవు చంద్రబాబు లేనిపోని తగాదాలు పెడుతున్నాడని మరొకరు చెప్పారు. ఎన్నికల తరువాత ఎటువంటి సమస్యలు ఏర్పడలేదని గ్రామానికి చెందిన గ్రామస్థులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు భాదితుల్ని తీసుకొని వచ్చి వారంతట వారే పోయారో లేదో చెప్పిస్తే నిజం తెలుస్తుందని అన్నారు. 
 
వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్ మాట్లాడుతూ పల్నాడుకు బహిరంగ చర్చకు రండి అక్కడ చర్చిద్దాం అని అన్నారు. వైసీపీ నాయకులు అందరం ఆత్మకూరు వెళతామని అక్కడ బాధితులతో చర్చిస్తామని అన్నారు. ఆత్మకూరు వెళ్ళి నిజాలను బయట పెడతామని అన్నారు. మరో వైసీపీ నాయకుడు మాట్లాడుతూ 60 నెలల టీడీపీ పరిపాలనలో గురువాచారి అనే వ్యక్తి అక్రమ మైనింగ్ కు వ్యతిరేఖంగా పోరాడటంతో చిత్రహింసలు పెట్టారని అన్నారు. ఆత్మకూరులో ప్రజల ముందు మాట్లాడితే నిజానిజాలు తెలుస్తాయని అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: