ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలకు హార్ట్ పాయింట్ గుంటూరు. గుంటూరు జిల్లాలోనే తెలుగుదేశం పార్టీకి పట్టు ఎక్కువగా ఉంటుంది.  ముఖ్యాంగా పల్నాడు ఏరియాలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉన్నది.  ఆ పట్టును నిలుపుకోవడానికి నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది.  రాయలసీమలో ఎలాగైతే ఫ్యాక్షన్ రాజకీయాలు ఉంటాయో.. గుంటూరు జిల్లాలోని పలనాడు ప్రాంతంలో కూడా అలాంటి రాజకీయాలే ఉంటాయి.  అయితే ఇటీవల కాలంలో ఈ రాజకీయాలు మారిపోయాయి.  


ప్రస్తుతం ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారు.  అయితే, గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో అలజడులు మొదలయ్యాయి.  తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన ఓటర్లపై  వైకాపా నేతలు దాడులు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.  ఈ నేపథ్యంలో అక్కడి పోలీస్ అధికారులు అప్రమత్తం అయ్యారు.  ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.  చాల రోజులుగా బాధితులు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన శిబిరంలో తలదాచుకుంటున్నారు.  


అటు వైకాపా కూడా పోటాపోటీగా శిబిరాలు ఏర్పాటు చేసింది.  తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తుల చేతుల్లో దెబ్బలు తిన్న వ్యక్తులు వైకాపా శిబిరాల్లో చేరారు.  పోటాపోటీగా శిబిరాలు ఏర్పాటు చేయడం.. చలో ఆత్మకూరు కార్యక్రమం చేపట్టడంతో.. పరిస్థితులు చేయిదాటిపోతుందేమో అని భయపడి.. పోలీసులు పల్నాడులు 144 సెక్షన్ ను ఏర్పాటు చేశారు.  


అసలు అక్కడ జరుగుతున్న విషయం ఏంటి.. ఎందుకని ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.  ఈ పరిస్థితులకు కారణం ఏంటి అనే దానిపై వివిధరకాల వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు పాలనాడులో తెలుగుదేశం పార్టీ పట్టుసాధిస్తు వస్తున్నది.  ఆ పట్టును సడలిపోకుండా ఉండేందుకు టిడిపి ప్రయత్నం చేస్తుంటే.. అధికారంలో వచ్చారు కాబట్టి.. పాలనాడుపై ఆధిపత్యం సంపాదించాలని వైకాపా చూస్తున్నది.  రెండు పార్టీల అధిపత్యపోరులో జనం నలిగిపోతున్నారు.  ఈ పరిస్థితుల నుంచి బయటపడటానికి ఇంకెంత సమయం పడుతుందో.. ఎందరు ప్రాణాలు కోల్పోతారో చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: