తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగబోతుంది. కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ ఎండీకి ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు నోటీసులు అందజేశారు. ఏ క్షణంలోనైనా సరే సమ్మె సైరన్ మోగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎప్పుడు సమ్మె మొదలవుతుందనే విషయం గురించి మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. టీఎంయూ నేతలు ఆర్టీసీ ఎండీకి ఈ నోటీసులు ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. 
 
ఈ నెల 25 వ తేదీ తరువాత ఏ క్షణమైనా సమ్మెలోకి వెళ్తామని టీఎంయూ నేతలు చెబుతున్నారు. ఈ నెల 25 వరకు డెడ్ లైన్ గా విధించినట్లు తెలుస్తుంది. తమ డిమాండ్స్ ఈ నెల 25 వ తేదీలోగా నెరవేర్చకపోతే మాత్రం ఖచ్చితంగా సమ్మెకు వెళతారని తెలుస్తోంది. ప్రధానంగా మూడు డిమాండ్లను నోటీసులో పెట్టినట్లు తెలుస్తుంది. ఇందులో ఒకటో తారీఖులోపు వేతనం ఇవ్వాలని, డ్రైవర్లకు ఉన్న సమస్యల పరిష్కారం మరియు నూతన బస్సుల కొనుగోలు మరియు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, వేతన సవరణ చేయాలని కోరినట్లు తెలుస్తుంది. 
 
సమ్మెపై ప్రభుత్వం కనుక స్పందించకపోతే మాత్రం వెనక్కు తగ్గే పరిస్థితి లేదని ఆర్టీసీ కార్మికులు చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే రవాణా శాఖ మంత్రిని టీఎంయూ నేతలు కలిసి పరిస్థితిని వివరించాలని సమాచారం. ఏపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటంతో తెలంగాణలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరినట్లు తెలుస్తుంది. 
 
ఆర్టీసీ పూర్తిగా నష్టాలలో ఉన్న కారణంతో సరైన సౌకర్యాలను అందించలేకపోతుందని అందువలన ప్రభుత్వమే ఆర్టీసీని విలీనం చేసుకొని ఆర్టీసీని ప్రక్షాళన చేయటంతో పాటు వేతన సమస్యను కూడా పరిష్కరించాలని కోరినట్లు తెలుస్తుంది. డ్రైవర్ల రిక్రూట్మెంట్ కూడా జరగాలని కోరినట్లు తెలుస్తుంది. మరి ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: