మ‌చ్చ‌లేని నాయ‌కుడు.. సామాన్య ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ ప్ర‌జాసేవే ప‌ర‌మ‌వాదిగా ప‌నిచేసే రామ‌న్న ఇప్పుడు బోరుమంటున్నాడు.. తెలంగాణ సీఎం కేసీఆర్ వ్య‌వ‌హార‌శైలీ న‌చ్చ‌క‌, ఆయ‌న చేసిన మోసంను త‌ట్టుకోలేక జోగు రామ‌న్న కంట‌క‌న్నీరు పెట్టాడు. అయితే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో త‌న‌కు అవ‌కాశం రాక‌పోవ‌డంతో మ‌న‌స్థాపం చెందిన రామ‌న్న గ‌త కొంత‌కాలంగా అజ్ఞాతంలోకి వెళ్ళాడు. క‌నీసం కుటుంబ స‌భ్యుల‌కు కూడా అందుబాటులో లేకుండా పోవ‌డంతో జోగు రామ‌న్న ఏమైపోయాడో.. ఎమైందో అనే ఆందోళ‌న‌తో కుటుంబ స‌భ్యులు గ‌డ‌పారు.


అయితే అజ్ఞాతం వీడిన జోగు రామ‌న్న మీడియా ముందుకు వ‌చ్చాడు.. మంత్రి పదవి రాకపోవడంతో మనస్తాపం చెందినట్లు ఆయన మీడియా సమావేశంలో పేర్కొంటూ భావోద్వేగానికి గురయ్యారు. మంత్రి పదవి ఇస్తారని ఆశపడినట్లు చెప్పారు. సర్పంచి స్థాయి నుంచి మచ్చలేని వ్యక్తిగా తనకు మంచి పేరు ఉందని... అలాంటి తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం మనస్థాపానికి గురిచేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధతోనే తనకు బీపీ ఎక్కువగా పెరిగిపోయిందని.. దీంతో ఆస్పత్రిలో  చేరినట్లు ఆయన చెప్పారు. అంతేతప్ప  తాను అజ్ఞాతం లోకి పోలేదని.. తనకు ఆ అవసరం లేదని వెల్లడించారు. ఎప్పటికైనా కేసీఆర్ తమ నాయకుడని ఆయన స్పష్టం చేశారు.


అయితే త‌మ ఆరాధ్య‌నాయ‌కుడు  జోగు రామన్నకు మంత్రి పదవి రాలేదన్న బాధతో ఆయన అభిమాని జిల్లా కేంద్రంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు, కార్యకర్తలు అప్రమత్తమై అడ్డుకున్నారు. మంత్రివర్గ విస్తరణ టీఆర్ఎస్‌లో పెద్ద చిచ్చేపెట్టింది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీ అధిష్టానంపై అసంతృప్తిని వెళ్లబుచ్చారు. ఏదేమైనా జోగు రామ‌న్న లాంటి నేత‌లు టీ ఆర్ ఎస్‌లో ఎంతో మంది ఉన్నారు. కానీ వారంతా దైర్యం చేసి బ‌హిరంగంగా త‌మ నిర‌స‌న వెలిబుచ్చ‌లేక పోతున్నార‌నే టాక్ ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: