ఒక గ్రహంమీద ఉండే పరిస్థితులు మరొక గ్రాహం మీద ఉండవు.  ఒకగ్రాహాన్ని పోలిన గ్రాహం మరొకటి ఉండకపోవచ్చు.  ఖచ్చితంగా ఉండవు అని కూడా చెప్పలేము. భూగ్రహాన్ని పోలిన గ్రహాలు ఈ సౌరవ్యవస్థలో చాలా ఉన్నాయి.  కానీ, వాటిల్లో మానవయోగ్యమైన వాతావరణం లేదని మాత్రం ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలను బట్టి తెలుస్తోంది.  పరిశోధనలు జరుగుతున్నా.. ఒక్క చోట కూడా మనిషి నివసించడానికి అనుగుణమైన పరిస్థితులు కనిపించడం లేదు.  


అయినా మనిషి తన ఆశను చంపుకోలేక ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.  ప్రయత్నాలకు తగ్గట్టుగా అంచనాలకు రాలేకపోయాడు.  సౌరవిశ్వంలో అలాంటి పరిస్థితులు లేకపోవచ్చు.  సౌరవ్యవస్థ అవతల ఉండే గ్రహాల్లో భూమిని పోలిన గ్రాహం లేవు అనడానికి వీలులేదు.  అలాంటి గ్రహాలపై నీటి జాడలు లేవని చెప్పడానికి వీలులేదు. ఒకవేళ నీరు ఉంటె ఖచ్చితంగా అక్కడ ప్రాణి ఉంటుంది.  ప్రాణి ఉంటె.. అక్కడ వాతావరణం తప్పనిసరిగా ఉంటుంది.  ఒకవేళ అదే నిజమైతే.. ప్రాణాలు నివశించేందుకు వీలుగా ఉంటె.. అక్కడి ప్రాణాలు ఎలా ఉన్నాయి.  మనలాగా ఉంటున్నాయా లేదంటే.. మనకన్నా అభివృద్ధిలో ముందు ఉంటున్నాయా  అన్నది తెలియాలి.  


ఇటీవలే బ్రిటన్ కు చెందిన పరిశోధకులు సౌరవ్యవస్థకు అవతల కె2 18బి అనే గ్రహాన్ని కనుగొన్నారు.  ఈ గ్రాహం భూగ్రహాన్ని పోలి ఉన్నది.  పైగా ఆ గ్రహంలో నీటి జాడలు ఉన్నట్టుగా ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు.  ఆ గ్రహంపై ఉష్ణోగ్రత మైనస్ 8 డిగ్రీలు ఉన్నట్టు గుర్తించారు.  కె2 18 బి గ్రహంపై నీటి ఆవిరితో పాటు హైడ్రోజన్, హీలియం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.  అక్కడ మీథేన్, నైట్రోజన్ వంటి వాయువులు కూడా ఉండటం విశేషం. ఇవన్నీ ఉండటంతో ఆ గ్రహంపై జీవరాశి ఉండే ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.  హైడ్రోజన్, హీలియం, నీటిఅరివి ఉంటె.. నీరు ఉన్నట్టే అని అర్ధం చేసుకోవచ్చు.  అయితే, మన దగ్గర ఉన్న రేడియో తరంగాల వ్యవస్థ కేవలం సౌరవ్యవస్థ వరకు మాత్రమే పనిచేస్తుంది. సౌరవ్యవస్థను దాటివెళ్లే విధంగా రేడియో తరంగాల ఫ్రీక్వెన్సీని తయారు చేసుకుంటే.. ఆవల ఉన్న గ్రహాలతో కూడా అనుసంధానం కావొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: