ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత నిర్ణయాలు వరసగా తీసుకుంటున్నారు.  ఒకదాని తరువాత మరొక నిర్ణయం చకచకా తీసుకుంటూ పాలనలో దూసుకెళ్తున్నారు.  ఇప్పటికే ఉద్యోగాల విషయంలోనూ, మౌళిక సదుపాయాల విషయంలోనూ జగన్ ముందు ఉన్నాడు.  పింఛన్ విధానం అమలు చేయడంలో జగన్ పాత్ర ప్రముఖమైనది.  దీంతో పాటు వచ్చే ఏడాది ఉగాది నాటికి రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని, అర్హులైన వారికి ఇల్లు ఇస్తామని చెప్పారు.  


ఆదిశగా ఏపీ ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తున్నది.  ఇదిలా ఉంటె, ఇప్పుడు పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలను పునర్విభజన చేసేందుకు సిద్ధం అయ్యింది.  ఎప్పటి నుంచి ఈ ప్రతిపాదన ఉన్నా అమలు జరగలేదు.  జిల్లాలను పునర్విభజన చేస్తే పరిపాలన సౌలభ్యం అవుతుంది.  దీంతో పాటు ఉద్యోగాల కల్పన జరుగుతుంది.  కొత్త వ్యవస్థలు అందుబాటులోకి వస్తాయి. అక్కడి ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లనవసరం లేకుండానే పనులు చక్కదిద్దుకోవచ్చు.  అందుకోసమే ఆంధ్రప్రదేశ్ జిల్లాలను పునర్విభజన చేయడానికి రెడీ అయ్యింది ప్రభుత్వం.  


ఇప్పటి వరకు 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తరువాత మరో 12 జిల్లాలు అదనం కాబోతున్నాయి.  అంటే మొత్తం 25 జిల్లాలు.  రాష్ట్రంలో 25 పార్లమెంట్ నియోజక వర్గాలు ఉన్నాయి.  ఈ పార్లమెంట్ నియోజక వర్గాలను బేస్ చేసుకొని 25 జిల్లాలను చేయాలని అనుకుంటోంది.  దీనికి సంబంధించిన నివేదికను ఇప్పటికే ప్రభుత్వం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ కు అందజేసినట్టు సమాచారం.  
ప్రస్తుతం 1. శ్రీకాకుళం 2. విజయనగరం3. విశాఖపట్నం 4. తూర్పుగోదావరి 5. పశ్చిమగోదావరి 6. కృష్ణా7. గుంటూరు 8. ప్రకాశం; 9. నెల్లూరు 10. కడప 11. కర్నూలు 12. అనంతపురం 13. చిత్తూరు. జిల్లాకు ఉన్నాయి.  కాగా, కొత్తగా పరిశీలిస్తున్న కొత్త జిల్లాలు 1. అనకాపల్లి  2. అరకు  3. అమలాపురం 4. రాజమండ్రి  5 నరసాపురం  6. విజయవాడ  7. . నరసరావుపేట 8. బాపట్ల 9. నంద్యాల  10. హిందూపురం 11. రాజంపేట  12. తిరుపతి.  జగన్ ప్రభుత్వం ఈ జిల్లాల పునర్విభజనపై పూర్తి క్లారిటీ రాగానే పునర్విభజన జరుగుతుందని తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: