ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలో కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం ఒడిఒడిగా అడుగులేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజక వర్గ పరిధిని ఒక జిల్లాగా పరిగణిస్తూ జిల్లా సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తుంది. రానున్నగణతంత్ర దినోత్సవం సందర్బంగా ఈ సరికొత్త జిల్లాలను అమల్లోకి తీసుకురావాలన్నకృతనిశ్చయంతో  ప్రభుత్వం ఉన్నట్టు విశ్వనీయ సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో  గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌‌ తో  ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీలో సీఎం జగన్‌ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన జిల్లా అంశాన్ని గవర్నర్‌ హరిచందన్‌‌ కు వివరుంచినట్టు సమాచారం. 



రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన చేసి వచ్చే జనవరి 26 నుంచి కొత్త జిల్లాలను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకు కేవలం  4 నెలల్లో కసరత్తు పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం సన్నర్ధమవుతుంది. ఇదే విషయమై సీఎం జగన్‌. గవర్నర్‌ తో మాట్లాడినట్లు తెలుస్తుంది.  రాష్ట్రంలో ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలని భావిస్తున్నట్లు వివరించినట్లు సమాచారం. జిల్లాల పునర్విభజన పాలనలో కొత్త ఒరవడికి, వికేంద్రీకృత సేవలకు ఉపకరిస్తుందని వివరించినట్టు సమాచారం.




 కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రజలకు అందించే సేవలను మరింత దగ్గర చేసేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పారని అంటున్నారు. దీనిపై గవర్నర్‌ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. 4 నెలల్లోపు కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తును పూర్తిచేసి.. జనవరి 26న గణతంత్ర దినోత్సవం నాడు అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.దీనితో ప్రస్తుతం ఉన్న జిల్లా సంఖ్య డబుల్ కానున్నది. రాష్ట్రంలో అమలులో 13 జిల్లాలు ఉన్నాయి. ఆ సంఖ్య కాస్తా  25  జిల్లాలుగా మారనున్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: