రాజకీయ నాయకులపై పోలీస్  కేసులుండటం కామన్. కానీ ఈ రాజకీయ నాయకుడు మాత్రం కేసుల్లో కూడా రికార్డు సాదించాలి అనుకుంటున్నట్టు కనిపిస్తుంది  .ఎందుకంటే ఏకంగా ఈయన పై ఇప్పటి వరకు 82  కేసులు నమోదయ్యాయి . అయన పేరేంటో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే .ఉత్తరప్రదేశ్ సమాజ్ వాద్ పార్టీ సీనియర్ నేత , పార్లమెంట్ సభ్యుడు అజమ్ ఖాన్ పై తాజాగా నమోదైన కేసుతో ...అయన మీద నమోదైన కేసుల సంఖ్య 82  చేరుకుంది . అజమ్ ఖాన్ కు  కేసుల తల నొప్పి వీడక పోగా... రోజు రోజుకు కేసులు పెరుగుతూ ఎక్కువవుతుంది .


అయితే ఇప్పటి వరకు అజమ్ ఖాన్ పై 82  కేసుల్లో ఎక్కువ శాతం భూకబ్జా లకు  సంబందించినవి  ఉండగా ...గేదెలని దొంగలించాడని ..పుస్తకాలు ఎత్తుకెళ్లాడని ఇలాంటి కొన్ని విచిత్రమైన కేసులు కూడా నమోదయ్యాయి  .అయితే ఇప్పుడు తాజాగా ఆయనపై ఏం కేసు నమోదు అయ్యిందో తెలుసా ... మేకలు దొంగలించాడని . ఒక  ఎంపీ పై మేకల దొంగతనం కేసు నమోదవ్వటం ఏంటని వినటానికి వింతగా ఉన్న ఇది నిజమే . అయితే ఈ కేసు కూడా ఇప్పటిది కాదండోయ్ ...2016 లో నసీమా ఖాతూన్ అనే మహిళా ఫిర్యాదు చెయ్యగా ఇప్పటికి ఎఫ్ఐఆర్  రాసి కేసు నమోదు చేశారు . 


తమ ఇంటి పై దాడి జరిపి బంగారం ,గేదెలు, మేకలు ,ఆవులు ఎత్తుకెళ్లారని యతీంఖాన్ సరాయ్ గేట్ చెందిన  సీమా ఖాతూన్ పోలీసులకి ఫిర్యాదు చేసింది . వక్ఫ్ బోర్డు లోని భూమి ని తాము   గత 20  సంవత్సరాలుగా కౌలు చేసుకుని బ్రతుకుతుంటే ...ఆ భూమిలో స్కూల్ ఏర్పాటు కోసం తమను కాళీ చేయాలనీ బెదిరిస్తూ ...తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని  ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు . దీంతో ఎంపీ అజమ్ ఖాన్ పై 82  వ కేసు నమోదైంది  


మరింత సమాచారం తెలుసుకోండి: