మనకున్న సామెతలు భలేగా పనికి వస్తుంటాయి.  కొంతమంది నేతలు వారసగాపెట్టి సామెతలు చెప్తుంటారు.  ఒట్టిమాటలు కట్టిపెట్టి గట్టిమేలు తలపెట్టు అనే సామెత లాంటి వార్త అందరికి వర్తిస్తుంది.  మన నాయకులు వరసగా మాటలు చెప్తుంటారు. చాలామంది మాటలు చెప్పి పబ్బం గడుపుకుంటుంటారు.  పనులు మాత్రం పక్కన పెట్టేస్తుంటారు.  మాటలు పక్కన పెట్టి చేతల్లో చూపించే వ్యక్తులు కొద్దిమంది మాత్రమే ఉంటారు.  అలా మాటలు చెప్పకుండా చేతలు చూపించే వ్యక్తుల్లో కేటీఆర్ ఒకరు.  


కేటీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తుంటారు.  ప్రస్తుతం నగరంలో డెంగ్యూ జ్వరాలు ప్రజలను కాటేస్తున్నాయి.  ఈ జ్వరాల కారణంగా మనిషి ఇబ్బందులు పడుతున్నారు.  నీరసించిపోయి ఫైట్ చేయలేక.. పారిపోలేక.. పాడెక్కుతున్నారు.  దీని నుంచి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.  మున్సిపల్ శాఖామంత్రిగా శానిటేషన్ పై కేటీఆర్ దృష్టిపెట్టారు.  ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.  హైదరాబాద్ నగరంలో చెత్త కనిపించకూడదని ఇప్పటికే అయన హుకుం జారీ చేశారు.  


ఇంతవరకు బాగానే ఉన్నది.  ఇప్పుడు అయన ఖాతాలో పరిశ్రమల శాఖ మంత్రి పదవికూడా ఉన్నది. కెసిఆర్ దగ్గర మైనింగ్ శాఖ ఉన్నది.  ప్రస్తుతం కేంద్రం నల్లమలలో యురేనియం తవ్వకాలపై దృష్టి పెట్టింది.  దీనికి రాష్ట్రప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వడంతో సేవ్ నల్లమల ఉద్యమం మొదలైంది.  నల్లమలలోని యురేనియం తవ్వకాలు జరిపితే దానివలన రాష్ట్రానికి, కేంద్రానికి బోలెడు ఆదాయం వస్తుంది.  ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది.  అయితే, ప్రజారోగ్యం దెబ్బతింటుంది.  పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది.  


దీంతో యురేనియం తవ్వకాల విషయం రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని, ప్రజలు గట్టిమేలు చేయాలనీ, ఒట్టిమాటలు కట్టిపెట్టాలని అంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. సేవ్ నల్లమల కోసం అవసరమైతే తమ ప్రాణాలు పణంగా పెట్టి నల్లమల అడవులను కాపాడుకుంటామని కాంగ్రెస్ పార్టీ మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అంటున్నారు.  నగర విషయాలే కాదు.. అటు నగరం బయట పరిస్థితులు కూడా చూడాలని, యురేనియం నుంచి వచ్చే అణుధార్మిక శక్తివలన జరిగే అనర్ధాల గురించి తెలుసుకోవాలని అంటున్నారు. మరి రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: