ఈరోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవితంలో భాగమైపోయింది. కాల్స్ మాట్లాడటం, సందేశాలు పంపటం కొరకు మాత్రమే కాక మొబైల్ లో ఉండే యాప్స్ ఉపయోగించి ఎన్నో పనులను చేసుకోవచ్చు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాల కొరకు కూడా మన మొబైల్ ఫోన్ ఎంతో ఉపయోగపడుతుంది. కానీ కొన్ని సందర్భాలలో మన మొబైల్ ఫోన్ ను మనం పోగొట్టుకోవటం లేదా ఇతరులు దొంగలించటం జరుగుతుంది. 
 
మన ఫోన్ ఇతరుల చేతిలోకి వెళితే చాలా సందర్భాలలో మన ఫోన్ దుర్వినియోగం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకసారి ఫోన్ మిస్ అయిందంటే దొరికే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ సమస్య ఎక్కువగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారం కోసం సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిష్టర్ (సీఐఈఆర్) ను అందుబాటులోకి తెచ్చింది. 
 
సీఐఈఆర్ టెక్నాలజీని ఉపయోగించటం ద్వారా పోగొట్టుకున్న మన ఫోన్ ఎక్కడుందో గుర్తించటం లేదా మన మొబైల్ ఫోన్ పని చేయకుండా బ్లాక్ చేయటం చేయవచ్చు. కేంద్ర టెలికాం శాఖ మంత్రి రవిప్రకాశ్ నిన్న ఈ సేవలను ప్రారంభించారు. ఈ విధానం ద్వారా మొబైల్ ఎవరైనా దొంగలిస్తే ఐఎంఈఐ నెంబర్ ద్వారా బ్లాక్ చేయవచ్చు. ఈ టెక్నాలజీ వినియోగించి మొబైల్ ఫోన్ ఎక్కడుందో ట్రాక్ కూడా చేయవచ్చు. 
 
దాదాపు మూడు సంవత్సరాల నుండి టెలీ కమ్యూనికేషన్స్ శాఖ ఈ టెక్నాలజీ మీద ప్రయోగాలు చేస్తుంది. మొబైల్ పోయిన వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలి. ఆ తరువాత 14422 అనే నెంబర్ కు కాల్ చేసి మొబైల్ కు సంబంధించిన సమాచారం అందించాల్సి ఉంటుంది. సమాచారం అందిస్తే ఐ ఎం ఈ ఐ నెంబర్ బ్లాక్ చేయటం లేదా ఫోన్ ఎక్కడుందో ట్రాక్ చేయటం జరుగుతుంది. ఐ ఎం ఈ ఐ నెంబర్ బ్లాక్ చేస్తే మొబైల్ ఏ నెట్వర్క్ తో పని చేయదు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: