రిలయన్స్ అంబానీకి డబ్బులకు కొదవ ఏంటి.. దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో ఆయన మొదటి స్థానంలో ఉన్నారు.  ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో ఆయనకు పరిశ్రమలు ఉన్నాయి.  వ్యాపారాలు ఉన్నాయి. ఇండియాలో జియోతో సంచలనం సృష్టించిన వ్యక్తి అయన.  ఇబ్బందులు అంటే ఎలా ఉంటాయో తెలియదు.  అయితే, ఇలాంటి అంబానీకి ఐటి శాఖ నోటీసులు పంపింది.  నోటీసులు పంపడంతో రిలయన్స్ షాక్ అయ్యింది.  దేశంలో అత్యధిక పన్నులు కడుతున్న జాబితాలో రిలయన్స్ గ్రూప్ ఒకటి.  అలాంటిది రిలయన్స్ కు ఎందుకు నోటీసులు పంపినట్టు.. కారణాలు ఏంటి... 


బ్లాక్‌మనీ యాక్ట్ 2015 కింద రియలన్స్ సంస్థలో భాగస్వాములుగా ఉన్న నీతా అంబానీ, నంత్ అంబానీ, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ లకు నోటీసులు జారీ చేసింది.  వీరు విదేశాల్లోని ఆదాయాన్ని, ఆస్తులను వెల్లడించలేదని సమాచారం.  2019, మార్చి 28న ఆదాయ పన్ను శాఖ ఈ నోటీసులు  జారీ చేసింది.  హెచ్ఎస్బిసి  జెనీవా ఖాతాలో 601 మిలియన్ డాలర్లుకు సంబంధించి 14 కంపెనీల్లోని ఒక కంపెనీలో అంతిమ లబ్ధిదారులుగా అంబానీ కుటుంబం పేర్లు ఉన్నాయని, ఆయా కంపెనీల్లో పెట్టుబడులు ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి ఐటి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది.  


అయితే, నోటీసుల విషయం తమకు తెలియదని, అలాంటి నోటీసులు ఏవి రాలేదని రిలయన్స్ సంస్థ పేర్కొన్నది.  వ్యాపారవేతలపై ఐటి శాఖ దృష్టిపెట్టిన తరువాత వారు వీరు అనే తేడా లేకుండా ప్రతి ఒకరిని పారదర్శకంగా పరిశీలిస్తోంది.  ఎక్కడ అవకతవకలు కనిపించినా.. ఉపేక్షించడం లేదు.  నోటీసులు పంపి ఆరా తీస్తోంది. ఇలా ఆరాలు తీయడంతో చాలా వరకు వ్యాపారవేత్తలు ఐటిని దాఖలు చేస్తున్నారు.  పన్నులు సక్రమంగా కడుతున్నారు.  సిబిఐ, ఈడిల అనుసంధానంతో ఐటి దాడులు చేస్తుండటంతో అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: