మొదటి త్రైమాసికంలో భారత ఆర్ధిక వ్యవస్థ కుదేలు కావడంతో యావత్ భారతదేశం భయంతో విలవిలలాడిపోయింది.  బ్యాంకులను విలీనం చేయడం వెనుక ఆర్థికమాంద్యం కారణం అని చాలామంది పేర్కొన్నారు.  కానీ, బ్యాంకులను విలీనం చేయడం ద్వారా బ్యాంకింగ్ సేవలను మరింతగా వినియోగదారులలోకి తీసుకెళ్లవచ్చని చెప్తూనే.. కొన్ని బ్యాంకుల్లో రుణాలు అధికం అయ్యాయని వాటిని బ్యాలెన్స్ చేయడానికి కూడా విలీనం తోడ్పడుతుందని ఆర్థికశాఖ మంత్రి గతంలో పేర్కొన్నారు.  


కాగా, ఇప్పుడు మరోసారి ప్రెస్ మీట్ పెట్టారు.  అనేక విషయాలపై ఆమె చర్చించారు.  ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని, చింతించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.  ప్రతి ఏడాది దేశం నుంచి అనేక ఉత్పత్తులు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతులౌతుంటాయి.  అలా ఎగుమతి చేసే వాటిపై పన్ను తగ్గించే విషయంపై ఆలోచిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.  


ఇక విదేశీ పెట్టుబడుల విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని, విదేశాల నుంచి ప్రత్యక్షంగా పెట్టుబడులు వచ్చే విధంగా చూస్తామని అన్నారు.  ఈ ఆర్ధిక సంవత్సరంలో వృద్ధి రేటు ఆశాజకంగానే ఉన్నది.  మరీ స్థాయిలో దిగజారలేదు.  వీలైనంత వరకు వృద్ధి రేటు తగ్గకుండా చూసేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని అన్నారు.  దీంతో పాటు క్రెడిట్ గ్యారెంటీ స్కీం ను తీసుకొచ్చామని.. దీంతో ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయని అన్నారు.  


బ్యాంకుల్లో రుణ వితరణ పెరుగుతుందని.. దానికి తగ్గట్టుగానే వసూలు చేసే విధంగా చూస్తామని అన్నారు.  ఆర్థికరంగం బలోపేతానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు ఆమె పేర్కొన్నారు.  ఎగుమతుల కోసం ఎంఈఐఈఎస్ పధకాన్ని తీసుకొచ్చినట్టు ఆమె చెప్పారు.  ఈ పధకం ద్వారా ఎగుమతులు పెరుగుతాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.  ఇక ఈజ్ ఆఫ్ డూయింగ్ తో భారత్ స్థానం మెరుగైందని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: