సాధారణంగా రోజు గంటల కొద్దీ కుర్చీలకు అతుక్కుపోయి కూర్చుంటున్నారు.  ఇలా గంటల కొద్దీ సమయం కుర్చీలకు అతుక్కుపోయి కూర్చోవడం వలన తేలియకుండానే నడుం కిందిభాగంపై ఒత్తిడి ఏర్పడుతుంది.  ఒక్కోసారి వెన్నుముక డిస్క్ ల్లో మార్పులు కూడా రావొచ్చు. వెన్నుముక మధ్యలో నుంచి అనేక నాడులు మెదడుకు అనుసంధానం చేయబడి ఉంటాయి.  వెన్నుముక కదలిక వలన ఆ నాడుల్లో ఇబ్బందులు వస్తాయి.  ఫలితం వెన్నునొప్పి.  మెడభాగంపై భారం పడుతుంది.  ఒత్తిడి పెరుగుతుంది.  


ఇలా నడుం భాగంపై ఒత్తిడి ఏర్పడినపుడు వీలైనంతగా ఆ ఒత్తిడి నుంచి బయటపడాలి.  దీర్ఘకాలంగా ఉండే నడుం నొప్పి కారణంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్టు ఇటీవల పరిశోధనలో తేలింది.  రోజువారీ పనుల్లో భాగంగా వచ్చే వెన్ను నొప్పుల నుంచి బయటపడాలి అంటే అందుకు తగిన వ్యాయామాలు చేయాలి.  ముఖ్యంగా యోగా.  


రోజు కొన్ని రకాల యోగాసనాలు వేయడం వలన ప్రయోజనాలు ఉన్నాయి.  యోగాసనాలు వేసే ముందు తప్పనిసరిగా శరీరాన్ని అందుకు సిద్ధం చేసే వార్మప్ వ్యాయామాలు చేయడం అవసరం.  అప్పుడే శరీరం యోగ చేయడానికి అనుకూలంగా మారుతుంది.  శరీరంలో అన్ని రకాల అవయవాలు యోగా చేయడానికి సిద్ధంగా తయారయ్యాక.. యోగాసనాలు చేయాలి.  


యోగా మ్యాట్ పై వెళ్లికలా పడుకొని కాళ్ళను ముడిచి గుండెలకు తాకే విధంగా ఆసనాలు వేయాలి.  ఇలా ఓ రెండు నుంచి మూడు నిమిషాలపాటు చేయాలి.  తరువాత రెండు చేతులు రెండు కాళ్లపై సింహం  ఆకారంలో కూర్చొని మెల్లిగా శ్వాసను పీల్చి వదలాలి.. ఇలా చేయడం వలన ఊపిరితిత్తులు విశాలంగా మారతాయి.  అంతేకాదు.. శ్వాసనాళాలు క్లీన్ అయ్యి ఊపిరి తిత్తులు ఆరోగ్యకరంగా మారతాయి.  ఫలితంగా వెన్నునొప్పి నుంచి క్రమంగా బయటపడొచ్చు.   ఆఫీస్ లో ప్రతి గంటకు ఒకసారి ఇలాంటి ఆసనం వేయాలి.  అలా చేయడం వలన ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: