హార్ట్ ఎటాక్.. ప్రపంచంలో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య.  గతంలో 60 దాటిన వ్యక్తులకు గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్ అనేవి వచ్చేవి. వయసు పెరిగిన సమయంలో శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడంతో రక్తసరఫరా సరిగా జరుగదు.  తాజా నివేదికల ప్రకారం మనిషి తీరికలేకుండా పనిచేస్తున్నాడు.  పనిసమయంలో తెలియని ఒత్తిడికి గురవుతున్నాడు.  దీంతో పాటు సరైన వ్యాయామం వంటివి చేయలేకపోతున్నాడు.  


కానీ, ఇప్పుడున్న ఈ కాలంలో మనిషి జీవన విధానం మారిపోయింది.  దానికి తగ్గట్టుగా ఆహార అలవాట్లు కూడా మారిపోయాయి.  ఫాస్ట్ ఫుడ్ తీసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది.  ఫాస్ట్ ఫుడ్ వలన శరీరంలో కొలెస్ట్రాల్ శాతం పెరిగిపోవడం ఫలితంగా మధుమేహం, ఊబకాయం పడుతున్నారు.  శరీరంలో కొలెస్ట్రాల్ శాతం తగ్గిపోతే.. పెరిగితే.. గుండెకు రక్తసరఫరా తగ్గిపోతుంది.  ఫలితంగా రక్తనాళాల్లో ప్రెజర్ పెరుగుతుంది.  దీనికారణంగా గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. దీన్ని ఇలాగే వదిలేస్తే.. హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది.  కాబట్టి ఖచ్చితంగా రోజు కనీసం 30 నిమిషాలపాటు వ్యాయామం చేయాలి. వ్యాయామం కుదరకపోతే కనీసం నడకైనా మంచిదే.  


భుజాల దగ్గర పట్టేసినట్టుగా ఉండటం.. చేతులు లాగినట్టు అనిపించడం.. కళ్ళు బైర్లు కమ్మినట్టుగా ఉండటం వంటిని హార్ట్ ఎటాక్ లక్షణాలు.  మనిషి జీవన విధానం మారడంతో.. వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయి.  చిన్న వయసులో వ్యాధినిరోధక శక్తి ఉంటుంది కాబట్టి ఇలాంటి లక్షణాలు అంత త్వరగా బయటపడువు.  సైలెంట్ గా ఇబ్బంది పెడుతుంది.  కాబట్టి వీలైనంతగా ఫాస్ట్ , జంక్ ఫుడ్స్ ను తీసుకోవడం తగ్గించండి.. గుండె జబ్బుల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి.  మనిషి ఆరోగ్యానికి మించినది మరొకటి లేదు.  అందుకే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు.  మనిషి ఉన్నప్పుడే ఏదైనా సాదించడగలడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: