Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 12:22 am IST

Menu &Sections

Search

అమ్మకు అన్నం పెట్టాక... పిన్నమ్మ కు గొలుసు చేయించండి

అమ్మకు అన్నం పెట్టాక... పిన్నమ్మ కు గొలుసు చేయించండి
అమ్మకు అన్నం పెట్టాక... పిన్నమ్మ కు గొలుసు చేయించండి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అమ్మకు  అన్నం పెట్టలేని వాడు పిన్నమ్మ కు బంగారు గొలుసు చేయిస్తాను… అన్నట్లుగా ఉంది తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. అమ్మకు అన్నం పెట్టిన తరువాత పిన్నమ్మ కు బంగారు గొలుసు చేయిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని,  కానీ కేసీఆర్ సర్కార్ వైఖరి ఎందుకో అందుకు భిన్నంగా ఉందని పలువురు మండిపడుతున్నారు  . ఆంధ్రప్రదేశ్ లో   దేవీపట్నం సమీపంలో జరిగిన బోటు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు తెలంగాణ సర్కార్  ఐదు లక్షల నష్ట పరిహారాన్నిప్రకటించిన విషయం తెల్సిందే  . ఇంతవరకూ అంత బాగానే ఉంది . కానీ గతంలో ప్రకటించిన నష్టపరిహారం సంగతేంది అంటూ బాధిత కుటుంబాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ,  మంత్రి కేటీఆర్ లను  ప్రశ్నిస్తున్నాయి .


 ఏడాది క్రితం కొండగట్టు లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు బోల్తా పడి సుమారు   52 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.   ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడం వల్ల,  చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారి  కుటుంబాలకు తీరని  విషాదాన్ని నింపింది. ఈ సంఘటన జరిగిన వెంటనే మృతుల కుటుంబాలను ఆదుకుంటామని,  ఐదు లక్షల నష్ట పరిహారం  అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే  ఇప్పటి వరకూ కూడా కొండగట్టు బాధితుల కుటుంబాలకు నష్టపరిహారం అందకపోవడం తో,   ఇటీవల బాధిత కుటుంబాల సభ్యులు  మంత్రులను అడ్డుకుని నిలదీశారు .


 ఈ నేపథ్యంలో దేవీపట్నం సమీపం లో  జరిగిన బోటు ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల నష్ట పరిహారం అందజేస్తామని ప్రకటించడంతో , ముందు ప్రకటించిన తమకే ఇంతవరకు అందజేసింది లేదు కానీ ... ఇప్పుడు పొరుగు రాష్ట్రం లో జరిగిన ప్రమాద బాధిత కుటుంబాలకు నష్టపరిహారం  అందజేస్తామని ప్రభుత్వ పెద్దలు బీరాలు పలుకుతున్నారంటూ వారు ఎద్దేవా చేస్తున్నారు .  ఆపద లో ఉన్నవారిని ఆదుకోవడం ప్రభుత్వాల ధర్మమే కానీ ఆశ పెట్టి మోసగించడం అన్యాయమే అవుతుందని బాధిత కుటుంబాల సభ్యులు మండిపడుతున్నారు . .


ammaku annam pettaka pinnamma ku golusu cheyinchandi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ సంభాషణంతా ఉత్తిదే ... పోలీసులకు సిఎంఓ అధికారుల ఫిర్యాదు
నన్నయ విశ్వ విద్యాలయం కీచక ఫ్రొఫెసర్ సస్పెండ్
ఆత్మబలిదానాలు .. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ... చర్చలకు రెడీ అంటోన్న సర్కార్
టీడీపీ ఆరోపణలపై భగ్గుమంటున్న ఏపీ పోలీసులు
ఇష్టారీతి లో ఈ సెలవులేమిటి ? ... నష్టపోయేది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే
ఆత్మరక్షణ లో ఉద్యోగ సంఘాల నేతలు ... అనవసర విమర్శలతో అభాసుపాలు
పోరంబోకు స్థలం లో పార్టీ కార్యాలయం ... షాకిచ్చిన రెవిన్యూ అధికారులు
చికిత్స పొందుతూ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి ... ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి
బాబు గారు తన తప్పు తెలుసుకున్నారా ?
24 గంటల్లోనే మాట మార్చడం వెనుక మర్మం ఏమిటీ ?
కేసీఆర్ వైఖరిపై భగ్గుమన్న సామాన్యుడు .. ఆ ఫోన్ సంభాషణ వైరల్
అమ్మో స్కూళ్ళు , కాలేజీలకు ఇంకా సెలవులా ... వద్దు బాబోయి
లేటు వయస్సు లో కవలలకు జన్మనిచ్చిన మరో మహిళ
గొంతెమ్మ కోర్కెలు తీర్చలేం... సమ్మె పై మంత్రుల ఎదురుదాడి
తెలంగాణ వారికంటే ఏపీ ఉద్యోగులకే జీత, భత్యాలు ఎక్కువ ... కానీ ?
పక్క వారు తొడ కోసుకున్నారని ... మనం మెడ కోసుకోలేం కదా ?
మాటల్లో కాకుండా చేతల్లో మోడీ స్వచ్చ్ భారత్
సిపిఐ అనుకున్నంత పని చేసింది ...
హవ్వ ... ఇదేమి విచిత్రమో రైతుభరోసా లబ్ధిదారుల జాబితా లో మంత్రి పేరు
అమెజాన్ డెలివరీ బాయ్ అత్యాచార కేసు లో కొత్త ట్విస్ట్
కేసీఆర్ కు జగన్ చేసింది చాలదన్నట్టుగా ... ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు కూడానా
బాబు ను అయన విమర్శిస్తే ప్రజలు హర్షిస్తారా?
ప్రభుత్వ ప్రకటన తో ఆగిపోతున్న ఆర్టీసీ కార్మికుల గుండెలు
కేసీఆర్ ఎత్తుగడ ఏంటో అందరికీ తెలిసిందిలే ...
50 వేల జీతం ఏ కార్మికుడికి వస్తుందో చెప్పు ... కేసీఆర్ ?
దక్షిణాది నటి ని పెళ్లి చేసుకోబోతున్న టీమిండియా యువ క్రికెటర్
ప్రైవేటీకరణ దిశగా భారతీయ రైల్వే ...
సమ్మె చేసేది ఆర్టీసీ కార్మికులైతే ... టీ - ఎన్జీఓ నేతలతో చర్చలా ?
ప్రభుత్వ తీరు పై హైకోర్టు అసంతృప్తి ...
మద్యం దుకాణాల నిర్వహణకు దరఖాస్తుల వెల్లువ
ఆర్టీసీ సమ్మెపై నేడు హైకోర్టు తీర్పు ... ఎవరికి షాక్ తగలనుందో ?
నేడు అనంత లో పురుడుపోసుకోనున్న కంటి వెలుగు
విద్యాసంస్థలకు సెలవులు పొడగింపు ?
నగర వాసులకు తప్పని తిప్పలు ...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.