తెలంగాణలో కేటీఆర్ కు యూత్ లో మంచి పేరు ఉన్నది.  మంత్రిగా మంచి పనులు చేస్తున్నారు.  ఐటి శాఖామంత్రిగా ప్రాజెక్టులు తీసుకురావడంలో కృషి చేస్తున్నారు.  ఈసారి కేటీఆర్ కు పరిశ్రమల శాఖ కూడా అప్పగించడంతో మరిన్ని పరిశ్రమలు తెలంగాణకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.  తెలంగాణకు పరిశ్రమల రాకతో తప్పనిసరిగా మంచి వాతావరణం నెలకొంటుందని అంటున్నారు.  రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. 


అటు ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ కు మంచి పేరు ఉన్నది.  కొత్తగా పార్టీని స్థాపించడం.. 2019లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయడం, 4 శాతానికి పైగా ఓట్లు సంపాదించుకున్నారు.  అయితే, ఛరిష్మా కలిగిన నేతలు లేకపోవడంతో పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.  అన్ని స్థానాల్లో పోటీ చేసి ఒక సీటు గెలుచుకున్నారు.  ఒక్కటి గెలిచినా పార్టీ కొంతమేర విజయం సాధించినట్టే కదా.  ప్రజల్లోనే ఉండి ప్రజల కోసమే పోరాటం చేస్తానని పవన్ చెప్తున్నారు.  


ఇకపై రాష్ట్రంలో పర్యటిస్తూ.. జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పోరాటం చేయబోతున్నారు.  హామీలు ఇచ్చినా అవి క్షేత్ర స్థాయిలో అమలు జరగడం లేదని, సొంతవారికి కాకుండా అర్హులైన అందరికి గ్రామ వాలంటీర్లుగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు వైకాపా కార్యకర్తలకు మాత్రమే గ్రామ వాలంటీర్లుగా ఉద్యోగాలు ఇచ్చారని పవన్ పేర్కొన్న సంగతి తెలిసిందే.  ప్రజల పక్షాన పవన్ పోరాటం చేస్తున్నారు.  ప్రజల్లో మంచి చరిష్మా ఉన్న కేటీఆర్, పవన్ కళ్యాణ్ లు ఒకే వేదికపై కలవబోతున్నారు.  


వీరి కలయికకు సైరా వేదిక కాబోతున్నది.  మాములుగా సైరా ప్రీ రిలీజ్ వేడుకను సెప్టెంబర్ 18 వ తేదీన నిర్వహించాలని అనుకున్నారు.  అయితే, ఆరోజున కేటీఆర్ కు ముఖ్యమైన పని ఉండటంతో రాలేకపోతున్నట్టు చెప్పారు.  అయితే, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 18 నుంచి 22 కి పోస్ట్ ఫోన్ అయ్యింది. కారణం, వాతావరణం అనుకూలంగా ఉండటం లేదని, అందుకే ఆదివారం సాయంత్రానికి పోస్ట్ ఫోన్ చేసినట్టుగా చెప్పారు.  ఆరోజే కేటీఆర్ ను ఎలాగైనా ఈ వేడుకకు తీసుకురావాలని అనుకుంటున్నారు.  అదే వేదికపై పవన్ కళ్యాణ్.. కేటీఆర్ లు కలుసుకోబోతున్నారు.  రామ్ చరణ్, కేటీఆర్, మెగాస్టార్ ల మధ్య మంచి అనుబంధం ఉన్నది.  అలాగే పవన్ తో కూడా కేటీఆర్ అనుబంధాన్ని ఏర్పరుచుకుంటే.. భవిష్యత్తులో కలిసి పనిచేయొచ్చు అన్నది వీరి ఉద్దేశ్యం. 


మరింత సమాచారం తెలుసుకోండి: