ప్రపంచంలో ఇప్పుడు అత్యంత విలువైన వస్తువు ఏది అంటే పెట్రోల్ అని చెప్పాలి.  మనదగ్గర సమృద్ధిగా పెట్రోల్ ఉంటె చాలు.. దాని వలన భారీ ఆదాయం వస్తుంది.  అందుకే చమురు బావులున్న దేశాల్లోని వ్యక్తులు భారీ ఆదాయం సంపాదిస్తుంటారు.  ఈ వ్యాపారం చాలా రిస్క్ తో కూడుకొని ఉంటుంది.  ఆదాయం కూడా అదే స్థాయిలో ఉంటుంది.  ప్రపంచంలో ఎక్కువ చమురును ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటి సౌదీ అరేబియా.  ఈ దేశం నుంచి దాదాపు 10శాతం చమురు ఉత్పత్తి అవుతుంది.  


సౌదీ అరేబియాలోని ఆరం కో సంస్థ ఎక్కువగా చమురును ఉత్పత్తి చేస్తుంది.  అలాగే ప్రపంచములోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం సౌదీ అరేబియాలోనే ఉండటం విశేషం.  కాగా, గత కొన్ని రోజులుగా ఇరాన్, సౌదీల మధ్య రగడ జరుగుతున్నది.  దీంతో ఇరాన్ ప్రోద్బలంతో హవుతి ఉగ్రవాదులు డ్రోన్ లతో ఆరం కో చమురు శుద్ది కర్మాగారంపై దాడులు చేశారు.  ఈ దాడుల్లో ప్రాణ నష్టం జరగలేదుగాని, దాడులతో .చమురు శుద్ధి కర్మాగారంలో మంటలు ఎగసిపడుతున్నాయి.  


ఫలితంగా, చమురు ఉత్పత్తి చాలా వరకు ఆగిపోయింది.  ఉత్పత్తి ఆగిపోవడంతో.. దాని ప్రభావం చమురు రేటుపై పడింది.  ఈ దాడులు ఇప్పట్లో ఆగవని చెప్పడంతో.. పెట్రోల్ ధరలు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.   ఇప్పటికే ఇండియాలో పెట్రోల్ ధరలు పెరిగాయి.  గత కొన్ని రోజుల క్రితం వరకు పెట్రల్ ధరలు తగ్గిపోగా, ఇప్పుడు మరలా ధరలు పెరగడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.  


ఇలాంటి దాడులు మరిన్ని జరుగుతాయని హవుతి తీవ్రవాదులు హెచ్చరిస్తున్నారు.  సౌదీ, ఇరాన్, సిరియా దేశాల మధ్య జరుగుతున్న ఈ అంతర్యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి.  చమురు ఉత్పత్తి కేంద్రాలు ఈ మూడు దేశాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ మూడు దేశాలకు చెందిన సంస్థలు ఇతర దేశాల్లో చమురు కంపెనీలను నిర్వహిస్తున్నాయి.  అంతర్యుద్ధం కారణంగా రోజుకు కోట్లాది డాలర్ల మేర నష్టం వాటిల్లుతోంది.  చమురు ఉత్పత్తి ఆగిపోతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: