Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 5:25 pm IST

Menu &Sections

Search

కోడెల శివప్రసాద్ హఠాత్మరణం పై ...ప్రముఖుల ఆవేదన ...

కోడెల శివప్రసాద్ హఠాత్మరణం పై ...ప్రముఖుల ఆవేదన ...
కోడెల శివప్రసాద్ హఠాత్మరణం పై ...ప్రముఖుల ఆవేదన ...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వి.హనుమంతరావు :
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ వి.హనుమంతరావు కూడా కోడెల మృతి పట్ల విస్మయానికి గురయ్యారు. ఏపీ రాజకీయాల్లో తనకు పరిచయం లేని వారంటూ ఎవరూ లేరని, అందునా కోడెల స్పీకర్ గా, మంత్రిగా పనిచేయడంతో సాన్నిహిత్యం ఉందని తెలిపారు. కోడెల ఉరివేసుకుని చనిపోయారంటున్నారని, మరి కుటుంబ కలహాలా, లేక రాజకీయ కక్షలా అనేవి తెలియడంలేదని అన్నారు.అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి ఉరివేసుకున్నాడంటే నమ్మలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. ఎవరైనా సామాన్యుడు ఉరివేసుకున్నాడంటే అప్పుల బాధతోనో, కుటుంబ సమస్యలతోనే చనిపోయాడని అనుకోవచ్చని, కానీ కోడెల వంటి మంచి వ్యక్తికి ఉరివేసుకోవాల్సిన అవసరం ఏంటని అని సందేహం వ్యక్తం చేశారు. ఇంత పెద్దవాడికే ఇలాంటి ఆలోచన వస్తే, సామాన్యుడి పరిస్థితి ఏంటన్నదే తన పాయింట్ అని వీహెచ్ వ్యాఖ్యానించారు.
అచ్చెన్నాయుడు:నిబద్ధత కలిగిన నేతను కోల్పోయామని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. ఇది వైసీపీ ప్రభుత్వం చేసిన హత్య అని, కోడెలను వెంటాడి, వేధించడం వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. పలు కేసుల్లో కోడెలకు బెయిల్ వచ్చినా ఆయనపై మళ్లీ కేసులు పెట్టాలని చూశారని, టీడీపీ నేతలను ఎంతో మందిని వెంటాడుతున్నారని ఆరోపించారు. ఇందుకు వైసీపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అధికారం, పదవులు శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా వైసీపీ నేతలకు సూచించారు. 
నారా లోకేశ్:ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు మరణం పట్ల నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోడెల శివప్రసాద్ గారి మరణం పార్టీకి తీరని లోటు అని వ్యాఖ్యానించారు. కోడెల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.ఈ సందర్భంగా కోడెల కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉండి తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న కోడెల శివప్రసాద్ గారు ఎల్లప్పుడూ ప్రజాసేవే పరమావధిగా వ్యవహరించేవారని, టీడీపీని పటిష్టం చేసేందుకు నిర్విరామంగా శ్రమించారని లోకేశ్ కీర్తించారు. 
సోమిరెడ్డి:కోడెల శివప్రసాద రావు తీవ్ర ఒత్తిడికి గురయ్యారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కోడెల మృతిపై సానుభూతి తెలిపిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోడెల మెడపై గాట్లు ఉన్నాయని, ఆత్మహత్యగా భావిస్తున్నట్టు చెప్పారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు.

సీఎం జగన్:విభజనానంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి స్పీకర్ గా వ్యవహరించిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు మరణం తెలుగు రాష్ట్రాలను కుదిపివేస్తోంది. దీనిపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. కోడెల మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన జగన్ సంతాపం ప్రకటించారు. డాక్టర్ కోడెల శివప్రసాదరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఓ ట్వీట్ వెలువడింది.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు:ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. కోడెల మృతి విచారకరమని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కోడెల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నట్టు చెప్పారు. 

చంద్రబాబు:సుదీర్ఘకాలం తనతో రాజకీయ ప్రస్థానం కొనసాగించిన కోడెల శివప్రసాదరావు మరణవార్త తెలియడంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. కోడెల చనిపోయారన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. డాక్టర్ వృత్తి నుంచి టీడీపీలో చేరి అత్యంత ప్రజాదరణ పొందారని, ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి, ప్రజలకు తీరని లోటు అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కోడెల కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్:ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీ కోడెల శివప్రసాద్ మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఓ ట్వీట్ చేశారు.

 
 


Political Leaders mourn on sudden demise of Kodela SivaPrasad
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తెలంగాణ ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త
తమిళనాడులో వింత దొంగతనం
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఓయూ జేఏసి దీక్ష
ఆర్టీసీ సమ్మె...కేసీఆర్ కొత్త నిర్ణయం పై ఆసక్తి
కందిపప్పు చేసిన మహత్యం .
ప్రమోషన్స్‌కు పదేళ్లు దూరంగా గడిపాను.. నయనతార
అనసూయ వ్యాఖ్యలు పై చాలా ఆశక్తి .
రూ. 2,000 నోటు మాయం ... దీని కూడా రాదు చేస్తారా ????
మగాళ్లు అంటే అంత తక్కువనా ఆడవాళ్లకి ...???
విదేశీ సిగరెట్ల అక్రమ రవాణా..గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్‌
టీవీ డిబేట్ లలో వైసీపీ నాయకులు మేలుకోండి
వానల రాకతో ....జలకాలాటలలో......!
ప్రైవేటు రైల్వేలో విభిన్న మర్యాదలు ..??
కోలీవుడ్ లో బంధుప్రీతి
భారత దేశ లింగమార్పిడి రచయిత్రికి అరుదయిన ఘనత
బాబు..మరి అంత ఇరిటేషన్ ఆరోగ్యానికి మంచిది కాదు
సీతారాముల ఆలయంలో దొంగల చోరీ..రూ.15లక్షల విలువ గల బంగారం,వెండి అపహరణ.
ఈ రోజు నుంచి అంతర్జాతీయ చిత్రోత్సవాలు
పట్టుబడ్డ లలిత జ్యూవెల్లర్స్ దొంగలు
డ్రీమ్‌గర్ల్‌ పై మధ్యప్రదేశ్‌మంత్రి ఆసక్తికర వ్యాఖ‍్యలు
చూడముచ్చటగా ఉన్న ..ప్రతిరోజూ పండగే షార్ట్ వీడియో ముచ్చట్లు
ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీలో 75 శాతం స్థానికులకే
బిగ్‌బాస్‌ సీజన్ టాస్కులు మల్లి రిపీట్ అవుతున్నాయా ???
ప్రొడ్యూసర్ గా హిట్ కొట్టేందుకు విజయ్ దేవరకొండ ప్రయత్నాలు..!
కోహ్లీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గంగూలీ
చిరంజీవి క్యారెక్టర్ అలాంటిది...కమెడియన్ కామెంట్స్
దేవస్థానాల దోపిడీ పై సినిమా చేయనున్న కొరటాల శివ...
వేశ్యలే సమాజానికి దేవతలు అని అంటున్న శ్రీరెడ్డి...
అగ్ర కథానాయికలు రెమ్యునరేషన్‌పై ప్రియమణి హాట్ కామెంట్లు..
మోహన్ బాబు తో కలిసిన రామోజీ...
అలవైకుంఠపురం లో నివేత పాత్ర ఏంటి ?
విజయ్ చెంత చేరనున్న అనసూయ....
నల్లమలలో జెట్ చక్కర్లుకు కారణం ఏంటో.....
బాలకృష్ణకు సమస్య తెచ్చిన టీవీ ఛానెల్ అత్యుత్సాహం..! ఫ్యాన్స్ మండిపాటు
ఆ సత్తా కేవలం ఆ హీరో కి మాత్రమే ఉంది అంటున్న నిర్మాత
స్టార్ డైరెక్టర్స్ ప్రమోట్ చేస్తున్న చిన్న సినిమా ..ఏంటి కథ ..??
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.