హైదరాబాద్ దేశంలో ఒకటే ఉన్నది.  అటు పాకిస్తాన్ లోని సింధ్ ప్రాంతంలో మరో హైదరాబాద్ ఉన్నది.  ఈ రెండు తప్పించి ప్రపంచంలో మరో హైదరాబాద్ లేదు.  మరి కర్ణాటకలో హైదరాబాద్ పేరును మార్చిడం ఏంటి.. అక్కడ ఎందుకు పేరు మారుస్తున్నారు. కర్ణాటకకు హైదరాబాద్ కు సంబంధం ఏంటి తెలుసుకుందాం.  


స్వాతంత్య్రానికి పూర్వం నిజాం ప్రభువుల పరిపాలన ఉన్న రోజుల్లో హైదరాబాద్ రాష్ట్రం యొక్క ప్రాంతాలు అటు కర్ణాటకలో కూడా ఉన్నాయి.  స్వాతంత్రం వచ్చిన తరువాత, హైదరాబాద్ హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం ప్రభువులు 1948 సెప్టెంబర్ 17 వ తేదీన ఇండియాలో విలీనం చేశారు.  ఆ తరువాత జరిగిన పునర్విభజనలో భాగంగా అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న గుల్బర్గా, బీదర్, రాయచూర్, యాదగిరి, బళ్లారి, కొప్పళ ప్రాంతాలు కర్ణాటకలో కలిసిపోయాయి.  


అయితే, ఆ ప్రాంతాలను ఇప్పటి వరకు హైదరాబాద్ కర్ణాటకగా పిలిచేవారు.  కాగా, యడ్యూరప్ప ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత హైదరాబాద్ కర్ణాటక ప్రాంతం పేరును మార్చాలని అనుకుంది.  ఇందులో భాగంగా ఆ ప్రాంతానికి కళ్యాణ కర్నాటకగా పేరు మార్చింది.  ఎప్పటి నుంచో పేరు మార్చాలనే డిమాండ్ ఉన్నా పెద్దగా ప్రభుత్వాలు పట్టించుకోలేదు.  కాగా, ఇప్పుడు యడ్యూరప్ప ప్రభుత్వం పేరును మారుస్తూ నిర్ణయం తీసుకుంది.  


అంతేకాదు, ఆ ఆరు జిల్లాల అభివృద్ధి కోసం అక్కడ ఓ ప్రత్యేకంగా సచివాలయంను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.  ఆ ఆరు జిల్లాలోని గ్రామాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధం అయ్యింది.  ఈ ఆరు జిల్లాల పేరు మార్చిడం, అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం వెనుక చాలా రాజకీయాలు ఉన్నట్టు అర్ధం అవుతున్నది.  ఈ ఆరు జిల్లాలు తెలంగాణా, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలు.  ఇక్కడ బీజేపీకి పెద్దగా పట్టులేదు.  ఆ ప్రాంతంలో పట్టు సాధిస్తే.. కర్ణాటకలో పూర్తిగా పట్టు సాధించినట్టు అవుతుందని ప్లాన్.  మరి బీజేపీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా చూద్దాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: