భద్రత విషయంలో నాయకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.  నాయకులకు ప్రాణ హాని ఉంటుంది.  ఎక్కడి నుంచి ఎవరు ఎలా ఎటాక్ చేస్తారో చెప్పలేరు.  అందుకే నాయకుల ప్రాణాలకు ప్రొటెక్షన్ గా పోలీసులు, సీఆర్ఎపిఎఫ్, ఎన్ఎస్ జీ ప్రొటెక్షన్ ఉంటుంది.  అధికారంలో ఉండే హైస్థాయి మంత్రులకు తప్పనిసరిగా ఐబి సూచనల మేరకు ఎన్ఎస్ జీ ప్రొటెక్షన్ ఇస్తుంటారు.  దేశంలో ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో మోడీ, అమిత్ షాలు ముందు ఉన్నారు.  వీరికి ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నది.  


ఈ మేరకు వీరికి ప్రొటెక్షన్ కల్పిస్తున్నారు.  ప్రధాని హోదాలో ఉన్న మోడీకి ఇచ్చే ప్రొటెక్షన్ ఎక్కువగా ఉంటుంది.  మోడీ దరిదాపుల్లోకి ఏ వ్యక్తి వెళ్ళలేడు.  మోడీ తరువాత దేశంలో ఎఫెక్ట్ ఉన్న నాయకుడు అమిత్ షా.  ఇప్పటికే ఉగ్రవాదులు పలుమార్లు హెచ్చరించారు.  షా మాత్రం ఎన్ఎస్ జీ ప్రొటెక్షన్ ససేమిరా అంటున్నారు.  ప్రధాని పదవి తరువాత దేశంలో కీలకమైన పదవి హోంశాఖ మంత్రి.  కేంద్ర హోంశాఖ మంత్రికి తప్పని సరిగా ఎన్ఎస్ జీ ప్రొటెక్షన్ ఇస్తారు.  


ఇప్పుడున్న సిఆర్పీఎఫ్ ప్రొటెక్షన్ చాలని షా పేర్కొన్నారు.  దీనిపై కేంద్రం పునరాలోచనలో పడింది. పదవిలో లేని మాజీలే ఎన్ఎస్ జీ ప్రొటెక్షన్ కావాలని కోరుతున్న సమయంలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి తనకు ఆ ప్రొటెక్షన్ అవసరం లేదని చెప్పడం విశేషం. తన భద్రత కంటే దేశం భద్రత ముఖ్యం అని పేర్కొన్నారు.  అయితే, దీనిపై హోంశాఖ నుంచి అధికారికంగా వార్త వెలువడాల్సి ఉన్నది.  దేశ చరిత్రలో ఒక హోంశాఖ మంత్రికి సిఆర్పీఎఫ్ ప్రొటెక్షన్ మాత్రమే కొనసాగడం ఇదే మొదటిసారి.  


గతంలో రాజ్ నాథ్ సింగ్ హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ఎస్జీ ప్రొటెక్షన్ ఉన్నది.  సొంత భద్రత కంటే దేశ భద్రత విషయంలో బీజేపీ ఫోకస్ చేసింది.  బీజేపీ నాయకులు కూడా తమ రక్షణ విషయంపై కంటే కూడా జాతీయ భద్రతపైనే దృష్టిపెట్టారు.  ఇక సీఆర్పీఎఫ్ రక్షణ కింద వందమంది కమాండోలు మూడు షిఫ్ట్ ల్లో రక్షణ కల్పిస్తారు.  ఇక హోంశాఖ మంత్రి ఇల్లు ఢిల్లీలో ఉంటుంది కాబట్టి ఢిల్లీ పోలీసుల పహారా కూడా ఉంటుంది.  ఢిల్లీ పోలీసులు 50 మంది ఇంటిదగ్గర రక్షణగా ఉంటారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: