సారు.. కారు.. పదహారు.. ఈ నినాదం ఎక్కడో విన్నట్టుగా ఉంది కదా.. మొన్నటి పార్ల మెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఇచ్చిన నినాదం ఇది.. తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ సీట్లు ఉన్నాయి. అందులో ఒకటి ఎలాగూ మజ్లిస్ కు వదిలేసింది టీఆర్ఎస్ .. అంటే మిగిలిన పదహారు కూడా కేవలం టీఆర్ఎస్ మాత్రమే గెలవాలన్నది టీఆర్ఎస్ లక్ష్యం..


అంతకు ముందు వచ్చిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఉత్సాహంలో అలా నినాదం ఇచ్చింది. కానీ అసెంబ్లీ ఎన్నికలకూ .. లోక్ సభ ఎన్నికలకూ మధ్య వచ్చిన కాస్త గ్యాప్ లోనే టీఆర్ఎస్ బాగా నీరసపడింది. జనంలో వ్యతిరేకత పెరిగింది. కనీసం 14 సీట్లయినా గెలుచుకుంటానని ధీమాగా ఉన్న టీఆర్ఎస్ కేవలం 9 ఎంపీ సీట్లకే పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ సీటు సాధించిన బీజేపీ ఏకంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ మూడు సీట్లు గెలుచుకుంది.


దీంతో సారు.. కారు.. పదహారు.. నినాదం అపహాస్యమైనట్టియింది. ఇప్పుడు తెలంగాణలో మరింతగా బలపడదామని ప్రయత్నిస్తున్న బీజేపీ టీఆర్ఎస్ సర్కారును బాగానే టార్గెట్ చేస్తోంది. తాజాగా సారు.. కారు.. పదహారు.. నినాదాన్ని గుర్తు చేస్తూ పేరడీగా... ఇది బారు.. బీరు.. రజాకార్ల సర్కారు అంటున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.


తెలంగాణ విమోచన దినం వేళ.. ఆ దినాన్ని అధికారికంగా నిర్వహించనుందుకు నిరసనగా కేసీఆర్ సర్కారు తీరుపై మండిపడ్డారు లక్ష్మణ్.. ఆయన ఇంకా ఏమన్నారంటే.. “ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న మజ్లీస్ అడుగులకు మడుగులు వత్తారు... విమోచన దినోత్సవం నిర్వహించ లేదు... 70సంవత్సరాలుగా రావణకాష్టంగా ఉన్న కశ్మీర్ సమస్యను మోదీ 70గంటల్లో పరిష్కరించారు... భాజపాను చూసి కేసీఆర్ భయపడుతున్నారు.”

s

మరింత సమాచారం తెలుసుకోండి: