కొత్తగా పెళ్లైన మహిళలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వలన దంపతులిద్దరూ జీవితాంతం అన్యోన్యంగా ఉండే అవకాశం ఉంది. దంపతులిద్దరి మధ్య ఎటువంటి సమస్యలు రాకుండా కలకాలం సంతోషంగా గడిపే అవకాశం ఉంది. చాలా మంది మహిళలు పెళ్లి తరువాత ఇంటికే పరిమితం కావాల్సి రావచ్చు. అలాంటి సమయంలో ఉద్యోగం చేయాలనే ఆలోచన ఉంటే ఆ విషయం గురించి భర్తకు చెప్పి ఒప్పించాలి. 
 
ఉద్యోగం చేయటం ద్వారా ఆర్థికపరమైన స్వేచ్ఛ కలిగి ఉండటంతో పాటు ఎవరిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. భార్యాభర్తల మధ్య ఏవైనా చిన్న చిన్న సమస్యలు వస్తే కలిసి చర్చించుకొని సమస్యలను పరిష్కరించుకోవాలి. అప్పుడే సమస్యలు తేలికగా పరిష్కారం అవుతాయి. ఒకరి నుండి మరొకరు ఏం ఆశిస్తున్నారో తెలిస్తే సమస్యలు తేలికగా పరిష్కారం అవుతాయి. భార్యాభర్తల మధ్య మానసిక, శారీరక బంధం దృఢంగా ఉంటే ఇద్దరి మధ్య ఎటువంటి సమస్యలు రావు. 
 
భర్త దగ్గర ప్రతిసారి తన మాటే నెగ్గించుకోవాలని కాకుండా ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరి అభిప్రాయాలను మరొకరితో పంచుకోవటం ద్వారా ఎటువంటి భేదాభిప్రాయాలు రాకుండా కాపురం సజావుగా సాగించవచ్చు. కుటుంబం నుండి కాని, వ్యక్తిగతంగా కాని ఏవైనా సమస్యలు వస్తే ఆ సమస్యలను భర్తతో పంచుకోవటం ఉత్తమం. సమస్యలను పంచుకోవటం వలన పరిష్కారం తేలికగా లభించే అవకాశాలు ఉన్నాయి. 
 
భార్యాభర్తల మధ్య అభిప్రాయాల్లో భేదాలు ఉన్న పక్షంలో గొడవలు పడకుండా సామరస్యపూర్వకంగా సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించాలి. కుటుంబానికి సంబంధించిన ఆర్థిక పరమైన విషయాలలో భర్తకు మాత్రమే అధికారం అనే ధోరణిలో ఉండకుండా భార్యాభర్తలిద్దరూ కలిసి సమిష్టిగా ఆలోచించి నిర్ణయం తీసుకునేలా భర్తను ఒప్పించాలి. ఏవైనా సమస్యలు ఉంటే మౌనంగా భరించటం కంటే వీలైనంత తక్కువ సమయంలో భర్తతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవటం ఉత్తమం. 



మరింత సమాచారం తెలుసుకోండి: