గల్ఫ్ లో ఆయిల్ యుద్ధం తప్పేలా కనిపించడం లేదు.  గత కొంతకాలంగా ఇరాన్, యెమన్, సౌదీ అరేబియా దేశాల మధ్య రగడ జరుగుతున్నది.  యెమన్ కు చెందిన హుతి తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నారు.  అది సౌదీ కి చెందిన అరాంకో ఆయిల్ కంపెనీపై.  డ్రోన్ దాడులు చేయడంతో చమురు శుద్ధి కర్మాగారంలో కొంతభాగం దెబ్బతిన్నది.  రెండు వారాల్లో దెబ్బతిన్న ప్రాంతాన్ని పునరుద్దరించగలం అని అంటున్నారు. 

కానీ హుతి తిరుగుబాటుదారులు మాత్రం.. ఇప్పటితో ముగియలేదని, మరిన్ని దాడులు జరుగుతాయని అంటోంది.  ఇలా మరిన్ని దాడులు జరిగితే.. దానివలన మరిన్ని ఇబ్బందులు రావొచ్చు.  ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై అరాంకో ప్రభావం చూపేలా కనిపిస్తోంది. చమురు ఎగుమతికి ఎలాంటి ఇబ్బందులు లేవని, అనుకున్న సమయానికి ఎగుమతి దారులకు చమురు రవాణా చేస్తామని అరాంకో యాజమాన్యం చెప్తున్నది.  


అరాంకో ప్రభావం, ఆర్ధిక మందగమనంతో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కొంతవరకు కుదేలయింది.  ఇండియాలో ఎప్పుడు లేనంతగా ఆర్ధిక వ్యవస్థ 5% శాతానికి పడిపోయింది.  అటు చైనాలోనూ అదే విధంగా 17 సంవత్సరాల కనిష్టానికి 4.4 % పడిపోయింది.  స్టాక్ మార్కెట్లు పతనం అవుతున్నాయి.  అటు అమెరికా ఆర్ధిక వ్యవస్థ సైతం ఆశాజనకంగా లేకపోవంతో..ఆర్ధిక ఎటువైపు అడుగులు వేస్తుందో అర్ధంకాని పరిస్థితి నెలకొన్నది.  


ప్రస్తుతం ముడిచమురు బ్యారెల్ 60డాలర్లు ఉన్నది.  అరాంకో చెప్పినట్టుగా రెండు వారాల్లో పునరుద్ధరణ జరగకపోతే.. ఈ చమురు ధర పెరిగే అవకాశం ఉంటుంది.  రెండు రెండు నెలల్లో 100డాలర్లకు చేరుకోవచ్చు.  అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతాయని వస్తున్న వార్తల కారణంగా ఇండియాలో పెట్రోల్ రేట్లు పెరిగే అవకాశం కనిపిస్తున్నది.  ఇప్పటికే కొద్దిమేర పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి.  రెండు వరాల తరువాత మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: