ఆగష్టు 15 వ తేదీన ప్రధాని మోడీ ఎర్రకోటపై ప్రసంగం చేస్తూ.. ప్లాస్టిక్ రహిత భారతదేశం తీసుకురావాలని కోరారు.  దానికి ప్రతి ఒక్కరు సహకరించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేదించాలని కోరారు.  ప్రతి ఒక్కరు తలచుకుంటే పని ఈజీగా అవుతుందని కోరారు.  కొంచం కష్టమైన పర్యావరణ వేత్తలు, సామాజికవేత్తలు కలిసికట్టుగా దీనిని ప్రచారం చేయాలనీ, సింగిల్ యూజ్ ను నిషేధిస్తే.. తప్పకుండా పర్యావరణం సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుందని, ఫలితంగా భారతదేశం పర్యావరణ రహితంగా మారుతుందని అన్నారు.  


దీనికి ప్రతి ఒక్కరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.  అందరూ దీన్ని ఎంతగానో మెచ్చుకున్నారు.  వరసగా మెచ్చుకోవడమే కాదు, ప్రచారం కూడా చేయడం మొదలుపెట్టారు.  ఇలా ప్రచారం కల్పిస్తూ కొంతవరకు ఇప్పటికే ఫలితాలు రాబడుతున్నారు.  ముఖ్యంగా సెలెబ్రిటీలు ప్లాస్టిక్ ను నిషేదించిన వాళ్లలో ఇప్పుడు ముందు ఉన్నారు.  బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి మొదటి రెస్పాన్స్ వచ్చింది.  కూలి నెంబర్ 1 సినిమా యూనిట్ ప్లాస్టిక్ ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.  దీనిపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.  ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు.  


అనంతరం ఆనంద్ మహీంద్రా నెటిజన్లకు ఇచ్చిన మాటకు కట్టుబడి తన ఆఫీస్ లో ప్లాస్టిక్ నిషేధాన్ని విధించారు.  ప్లాస్టిక్ బాటిల్స్ స్థానంలో స్టీల్, రాగి బాటిల్స్ దర్శనం ఇచ్చాయి.  ఇకపై తమ ఆఫీస్ లో ఇలాంటివే ఉంటాయని హామీ ఇచ్చారు.  మహీంద్రా బాటలో మరికొన్ని ఆఫీస్ లు కూడా నడవబోతున్నాయి.  ఇదిలా ఉంటె, అటు కేంద్ర ప్రభుత్వ శాఖల ఆధ్వరంలో నడిచే ఆఫీస్ లో కూడా ప్లాస్టిక్ స్థానంలో గాజు బాటిళ్లు వాడుతున్నారు.  నిషేధం విధించాలని చెప్పిన ప్రభుత్వం మొదట ఆచరించి చూపిస్తే దానిని అందరు ఫాలో అవుతుంటారు కదా.  


అందుకే ప్రభుత్వ కార్యలాలయాల్లో గాజు బాటిళ్లు ఉపయోగిస్తున్నారు.  ఇందులో భాగంగా ఇప్పుడు ప్రభుత్వం మరికొంత పురోగతిని సాధించింది.  అటు న్యూఢిల్లీలోని హోటల్స్ సైతం ప్లాస్టిక్ బాటిల్స్ స్థానంలో గాజు బాటిల్స్ వాడేందుకు ముందుకు వస్తున్నాయి.  సామాన్యులు సైతం ఇలా ముందుకు వచ్చి ప్లాస్టిక్ వినియోగాన్ని పక్కన పెడితే.. చాలా వరకు పురోభివృద్ధి కనిపిస్తుంది.  ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండేందుకు అవకాశం దొరుకుతుంది.  ప్లాస్టిక్ రహిత భారతదేశం సాధ్యం అవుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: