అవును.. వాళ్లు ఇప్పుడు జగన్ ను తెగ తిట్టుకుంటున్నారట.. తమ ఆదాయానికి గండి కొట్టాడని తెగ బాధపడిపోతున్నారట.. ఇంతకీ ఎవరు వారు అనుకుంటున్నారా.. వారే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేసే వైద్యులు.. అవును మరి జగన్ నిర్ణయంతో వారి ఆదాయం సగానికి సగం పడిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. ముఖ్యమంత్రి జగన్ ఇటీవలి కాలంలో తీసుకున్న కొన్ని మంచి నిర్ణయాలలో ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీసు నిషేధం అత్యుత్తమంగా కనిపిస్తోంది.


జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. లక్షల రూపాయల జీతం తీసుకుంటూ, కార్పొరేట్ సేవలు ప్రైవేటుగా అందిస్తున్న ప్రభుత్వ వైద్యుల అత్యాశ, దురాశపై ఇది వేటు వేయడంగానే భావించాల్సి ఉంటుంది. ఆ మేరకు అలాంటి నిర్ణయం తీసుకున్న జగన్ నిస్సందేహంగా అభినందీయుడే. ఇది మనసున్న వారు మెచ్చుకోవలసిందే. నిజానికి ప్రభుత్వ వైద్యుల సంఖ్యనే చాలా తక్కువ. రోగుల నిష్పత్తితో పోల్చితే ఆ సంఖ్య అత్యల్పం. ఆ సంఖ్యను పెంచాలన్న ఆలోచన ఏ పాలకులకూ రాకపోవడం దారుణం.


కానీ ఆ ఉన్న సమయాన్ని కూడా వారు కాసుల కక్కుర్తి కోసం కార్పొరేట్ ఆసుపత్రులలో సేవలందిస్తున్న తీరు సర్కారు ఆసుపత్రులకొచ్చే రోగుల పాలిట శాపంగా మారింది. ఇది కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నదే. కానీ ఏ ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించేందుకు సాహసించలేదు. పైగా సర్కారు వైద్యుల జోలికెళితే సమ్మె చేస్తారన్న భయంతో వణికిపోయేవి. నిన్నటి చంద్రబాబు సర్కారు వరకూ జరిగిందదే.


కానీ జగన్ ధైర్యంతో వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసును నిషేధించి చరిత్ర సృష్టించారు. ఆ మేరకు సుజాతారావు కమిటీ చేసిన సిఫార్సు అమలయితే, సర్కారు వైద్యులు ఇప్పుడు తీసుకుంటున్న వేతనానికి 25 శాతం అదనంగా అందుతుంది. అందువల్ల కనీసం ఎక్కువ జీతం వస్తుందన్న భావనతో, వారు ప్రైవేటు సేవలందించే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: