మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  72 సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ఉండిపోయిన కాశ్మీర్ సమస్యను మోడీ 72 రోజుల్లో క్లియర్ చేశారు.  రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ కేవలం 72 రోజుల్లోనే జమ్మూ కాశ్మీర్ సమస్యను పరిష్కరించారు.  ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ ను ఇండియాలో పూర్తిగా విలీనం చేసుకున్నారు.  ఇండియాలో జమ్మూ కాశ్మీర్ పూర్తిగా విలీనం చేసిన తరువాత ఇండియా నెక్స్ట్ టార్గెట్ పీవోకేపై పెట్టింది.  


మరికొన్ని రోజుల్లో పీవోకే పూర్తిగా విలీనం అవుతుందని అంటున్నారు.  గతంలో మోడీని ఎదిరించే వ్యక్తులు.. ఇప్పుడు  మోడీకి గురించి మాట్లాడేందుకు భయపడుతున్నారు.  మోడీని విమర్శిస్తే ఏమౌతుందో అని సందేహిస్తున్నారు.  అంతేకాదు.. మోడీని పల్లెత్తు మాట అనాలన్నా ఒకటికి నాలుగుసార్లు అలోచించి అడుగు వేస్తున్నారు.  పాకిస్తాన్ ను అంతర్జాతీయంగా ఒంటరిని చేసింది ఇండియా. కాశ్మీర్ విషయంలో పాక్ కు సపోర్ట్ చేస్తూ వచ్చిన చైనా... జెనీవాలో జరిగిన మానవహక్కుల సంఘంలో పాక్ ప్రవేశపెట్టాలని చూసిన ప్రతిపాదనకు చైనా కూడా సపోర్ట్ చేయకపోవడం విశేషం.  


ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్ మాత్రమే కాదు.. 1947 ఇండియాకు స్వాతంత్రం వచ్చినపుడు దేశంలో భాగంగా ఉన్న పీవోకే, సియాచిన్ కూడా ఇండియాలో భాగం అని వాటిని కూడా ఇండియా వదులుకోబోదని, అన్నింటిని తిరిగి పొందుతుందని అమిత్ షా పార్లమెంట్ లో చెప్పిన సంగతి తెలిసిందే.  అమిత్ షా పీవోకే విషయంలో పార్లమెంట్ లో స్పష్టమైన సందేశం ఇవ్వడంతో పీవోకే విషయంలో పాక్ మల్లగుల్లాలు పడుతున్నది.  ఇండియా పీవోకేను తప్పకుండా తిరిగి తెచ్చుకుంటుందని పాక్ భయపడుతున్నది.  


ఇక ఇదే విషయంపై కేంద్ర మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి  ఇదే విషయంపై మాట్లాడారు.  ఇండియాకు సంబంధించిన దేన్నీ కూడా ఇండియా వదులుకోబోదని అయన పేర్కొన్నారు.  72 సంవత్సరాలుగా కానీ పనులు ఇకపై చకచకా పూర్తవుతాయని అన్నారు.  దేశంలో వందేమాతరాన్ని వ్యతిరేకించే వ్యక్తులు ఉన్నారని, వారికి ఇండియాలో ఉండే అర్హత లేదని, అలాంటి వ్యక్తులు ఇండియాను వదిలి వెళ్లడం మంచిదని అన్నారు.  ప్రతాప్ చంద్ర సారంగి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: