Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 7:07 am IST

Menu &Sections

Search

తెరపైకి క్విడ్ ప్రోకో అస్త్రం..?

తెరపైకి క్విడ్ ప్రోకో అస్త్రం..?
తెరపైకి క్విడ్ ప్రోకో అస్త్రం..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పచ్చ కామెర్ల పార్టీ  ఆరోపిస్తున్నట్టుగా  దేశం మొత్తానికి అన్ని రాష్ట్రాలకు కలిపి కేంద్రం కేటాయించిన బడ్జెట్ అంతా ఆంధ్ర ప్రదేశ్ కే  విడుదల చేసిన కూడా టీడీపీ ఆరోపించిన ఓలెక్ట్రా క్విడ్ ప్రో కో సాధ్యం కాదు. అసలు ఆంధ్ర ప్రదేశ్ లో బస్సుల కొనుగోలుకు లేని బడ్జెట్ను టీడీపీ సృస్టించిందంటే పోలవరంపై వారి కుట్ర ఎంత తీవ్రంగా ఉందొ అర్థం చేసుకోవచ్చు. దేశంలో 7090 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడానికి రూ. 3545 కోట్ల ప్రణాళికను కేంద్రం  ప్రకటించింది. అన్ని రకాల వాహనాలకు  కలిపి మొత్తం పదివేల కోట్లను కేంద్రం కేటాయించింది. కానీ రాష్ట్రంలోనే వేలకోట్లు క్విడ్ ప్రో కో పేరుతో ఓలెక్టరకు రాష్ట్ర ప్రభుత్వం కట్టబెడుతోందని టీడీపీ దాని అనుబంధ పచ్చ మీడియా ప్రచారం చేస్తున్నాయంటే పోలవరంపై విషం ఏ స్థాయిలో చిమ్ముతున్నారో తెలిసిపోతోంది. పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ విధి విధానాలపై ఒక సంస్ధకే మేలు చేసే విధంగా ఉన్నాయంటూ తొలుత పచ్చ మీడియా, తర్వాత నేరుగా బాబు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని నిర్ధారణ అవ్వడంతో కొత్తగా క్విడ్ప్రోకో అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారా...?. తక్కువ ధరకు ప్రాజెక్టు పనులు చేపడితో నష్టం వస్తుందని బాబు బ్యాచ్ నిర్ధారించేసిందా? అలా నష్టం వస్తే దానికి క్విడ్ప్రోకో కింద ప్రభుత్వం మరో రూపంలో నష్టం భర్తీ చేయటం సాధ్యమవుతుందా? గతంలో ఏలినవారికి ఈ కిటుకు ఎలా తెలిశాయి? అసలు అది సాధ్యమవుతుందా? పైగా వారి లెక్కప్రకారం ఏకంగా వందలకోట్ల రూపాయలు క్విడ్ప్రోకో. వింటేనే విస్తు కలుగుతోంది. చంద్రబాబు అండ్ కో ఆరోపణల్లో నిజమెంతో పరిశీలిద్ధాం. వారి లెక్క ప్రకారం ఐదు వందల కోట్ల తక్కువకు మేఘా ఇంజనీరింగ్ టెండర్ దాఖలు చేస్తే అందుకు ప్రతిఫలంగా, నష్టాన్ని భర్తి చేసే విధంగా వేలకోట్ల రూపాయలు ఏపిఎస్ఆర్టీసీ నుంచి బస్సులు కొనుగోలు రూపంలో చెల్లించడం సాధ్యమవుతుందా?.  ఏకంగా ఏపి సర్కార్ రూ. 2181 కోట్లు ఒలెక్ట్రాకు (ఒలెక్ట్రా సంస్థలో మేఘా పెట్టుబడులు ఉన్నాయి) చెల్లింస్తుందని తెలుగుదేశం ప్రచారం చేస్తోంది. తద్వారా ఆ సంస్థ క్యాపిటల్ 20 వేల కోట్లకు చేరితే అందులో మేఘాకు రూ. 12 వేల కోట్లు ప్రయోజనం చేకూరుతుందని వారి ప్రచారం. ఇందులో నిజా నిజాలు పరిశీలించే ముందు ఒలెక్ట్రా గురించి పరిశీలిస్తే అస్సలు ఈ బస్సును దేశంలో తొలిసారిగా ప్రమోట్ చేసింది నాటి సీఎం చంద్రబాబు. 23 మే 2018న అమరావతిలో ఈ బస్సులో ఆయన ప్రయాణించి ఇంధన ఆదాతో పాటు కాలుష్య నివారణకు ఈ-బస్సులు (ఎలక్ట్రిక్ బస్సులు) కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ-బస్సులను ప్రోత్సహించేందుకే ఫేమ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఏపిలో ఒలెక్ట్రా నుంచి ఈ - బస్సులు కొనుగోలు చేసేందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిపాదించినా ఇప్పటికీ పూర్తిగా ఆచరణ సాధ్యం కాలేదు. అందుకు నిధుల కొరత ప్రధాన సమస్య. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 350 బస్సులను సబ్సిడీపై కొనుగోలు చేసేందుకు నిధులు కేటాయించింది. ఆ నిధులు ఇంకా విడుదల కాలేదు. ఏపి ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుండడంతో కేంద్రం ఇచ్చే నిధులతోనే బస్సులు కొనుగోలు చేయాలి. ఇందుకు టెండర్లు ఇటీవలనే పిలిచింది. ఈ టెండర్లలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ బస్సులను తయారు చేసే సంస్థలు పోటీ పడవచ్చు. ఈ ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమైంది. ఒకవేళ మొత్తం బస్సులన్నీ టెండర్లో ఒలెక్ట్రాకే దక్కితే 350 బస్సుల విలువ 700 కోట్లు ఉండవచ్చు. వారి చెబుతున్నట్లుగా జరిగితే అన్ని బస్సులు ఒలెక్ట్రా నుంచే కొనుగోలు చేస్తే ఆ సంస్థ వాటిని ఉత్పత్తి చేసేందుకు అయ్యే ఖర్చు తదితరులు అన్నీ పోనూ నామమాత్రంగా మిగులు ఉంటుంది. అంతేగానీ 700 కోట్ల రూపాయలు అప్పనంగా మిగిలిపోయే అవకాశం ఉండదు. అయితే పచ్చమీడియాతో పాటు చంద్రబాబు బ్యాచ్ ఏకంగా వేలకోట్ల రూపాయలు ప్రభుత్వం ఒలెక్ట్రాకు చెల్లిస్తుందని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాంకేతికంగా మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే అసలు ఇందులో క్విడ్ప్రోకో ఉందో లేదో ఇట్టే అర్థమైపోతుంది.ఫేమ్-2 (ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మాన్యుఫాక్చరింగ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) విధానం కింద దేశంలో 7090 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడానికి రూ. 3545 కోట్ల ప్రణాళికను ప్రకటించింది. అన్ని రకాల వాహనాలను కలిపితే మొత్తం పదివేల కోట్లను కేంద్రం కేటాయించింది. రాష్ట్రాల రవాణా సంస్థలు విద్యుత్ బస్సులను కొనుగోలు చేయడానికి ప్రతి కిలోవాట్ సామర్థ్యానికి రూ. 20 వేల రాయితీని కూడా ప్రకటించింది. అలాగే రాష్ట్ర రవాణా సంస్థల నిర్వహణ వ్యయాల ఆధారంగా కూడా రాయితీలను కేంద్రం భరించనుంది. ఇందులో భాగంగానే అనేక రాష్ట్రాలు విద్యుత్ వాహానాల విధానాలను ప్రకటించాయి. విద్యుత్ బస్సుల కొనుగోలు రాష్ట్రాలు టెండర్లను పిలుస్తున్నాయి. ఈప్రక్రియ చంద్రబాబు హయాంలోనే మొదలైంది. ఇప్పుడు జగన్ వచ్చి చేస్తున్నదల్ల చంద్రబాబు విధానాలనే.. మేఘా కంపెనీ నుంచి బస్సులను కొనుగోలు చేయడంతో సహా. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ బస్సులు ఇప్పటికే అనేక రాష్ట్రాలలో తిరుగుతున్నాయి. తొలిసారిగా ప్రదర్శించింది అమరావతిలోనే. ఆ తర్వాత తిరుమల కొండకు ట్రయల్ నిర్వహించారు. హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి నుంచి రోహతంగ్ పాస్ వరకు అత్యంత ఎత్తైన ప్రదేశానికి ప్రయాణించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్కు ఎక్కింది. దీనికి తోడు కేరళలో అయ్యప్పస్వామి యాత్రకు దీన్ని ఉపయోగిస్తున్నారు. ఢిల్లీ, కర్ఱాటక, మహారాష్ట్ర, తెలంగాణా రాష్ట్రాలలో ఇప్పటికే ఒలెక్ట్రా గ్రీన్టెక్ ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. గత వారమే ముంబైలో  దాదాపు పది ఒలెక్ట్రా బస్సులను సీటీ సర్వీసుల కోసం బెస్ట్ ప్రవేశపెట్టింది. పూణేలోనే సీటీ బస్సులుగా నడుస్తున్నాయి.
హైదరాబాద్లో వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్పోర్టుకు నడుస్తున్న 40 ఎలక్ట్రిక్ బస్సులూ ఒలెక్ట్రావే.  ఇక్కడ మరో విషయం అశోక్ లేలాండ్ కూడా ఇటీవలే ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తున్నా అవి ఎత్తైన ప్రదేశాలను చేరుకోలేకపోతున్నాయి. ప్రస్తుతం దేశంలో వివిధ రాష్ట్రాలలో విజయవంతంగ నడుస్తున్నవి ఒలెక్ట్రా గ్రీన్టెక్ బస్సులే. ఇవి కాక, ఉత్తరప్రదేశ్, ఢిల్లి, తమిళనాడు, కర్ణాటకతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాలూ కేంద్రం ఇస్తున్న రాయితీని ఉపయోగించుకోవడానికి విద్యుత్ బస్సుల కోసం టెండర్లను పిలుస్తున్నాయి. ఫేమ్ 2 లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కూడా త్వరలో విద్యుత్ బస్సుల కోసం టెండర్లను పిలవొచ్చు. ఈ టెండర్లలో ప్రమాణాలు, ఉత్పత్తి సామర్థ్యం, సాంకేతిక అంశాల కారణంగా బస్సుల కొనుగోలు జరుగుతుంది. ఈ వాస్తవాలన్నీ మరిచి జగన్కు కంపెనీలో పరోక్ష వాటాను అంటగట్టడం, క్విడ్ ప్రో కో జరిగినట్టు వక్రీకరించడం చూస్తుంటే  నిన్నటి దాకా ఏటిఎంలా  వాడుకున్న పోలవరం తమ వారి చేతి నుంచి తప్పి పోతుందన్న కడుపు మంట తప్ప  మరేది కనిపించడంలేదు. ప్రస్తుతం దాదాపు రూ. 1500 కోట్లుగా ఒలెక్ట్రా గ్రీన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 20,000 కోట్ల కు చేరుతుందట. అందువల్ల మేఘా కృష్ణారెడ్డికి కంపెనీలో వున్న వాటా విలువ వెయ్యి కోట్ల నుంచి ఏకంగా 11 వేల కోట్ల రూపాయలు చేరుకుంటుందట. ఈ లెక్క స్టాక్ మార్కెట్ నిపుణులెవరికీ చూపించినా నవ్వుకుంటారు. 
టిడిపి వర్గాలు అంటున్నట్టుగా ఒలెక్ట్రా  గ్రీన్టెక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత రూ. 1528.35 కోట్లు. ఈ కంపెనీ మేఘా హోల్డింగ్స్ వాటా 44.47. శాతం. అంటే మేఘా హోల్డింగ్స్ వాటా విలువ రూ. 679.66 కోట్లు. శుక్రవారం నాటికి ఒలెక్ట్రా గ్రీన్ టెక్ షేరు ధర నేషనల్ స్టాక్ ఎక్స్చేంజిలో రూ.192.05 వద్ద ముగిసింది. టిడిపి నేతలు ఆరోపిస్తున్నట్టుగా ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 20,000 కోట్లకు చేరుకోవాలంటే షేరు ధర కనీసం రూ. 2520 చేరుకోవాలి. మరి చంద్రబాబు కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్ 1992 లో స్థాపించి 1994లో పబ్లిక్ ఇష్యూకు వచ్చింది.  ఇన్నేండ్లు అధికారంలో ఉండి అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో హెరిటేజ్ పాలనే కొనిపించినా సరే 25 ఏండ్ల తర్వాత కూడా హెరిటేజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇంకా రూ. 1754.54 కోట్ల రూపాయలు గానే ఎందుకు ఉన్నట్టు..?. ప్రపంచంలో అత్యంత పెద్ద బ్యాటరీ కంపెనీ చైనాకు చెందిన బీవైడీ. దీనికి పోటీ కంపెనీ టెస్లా బ్యాటరీలు విఫలమై పేలిపోయాయి. ఇప్పటివరకు బీవైడీ బ్యాటరీలు పేలిన లేదా పనిచేయకుండా విఫలమైన సందర్భాలు లేవు. ఈ కారణంగానే బీవైడీలో కేవలం 1.92 శాతం వాటా కోసం సామ్సంగ్ 450 మిలియన్ డాలర్ల చెల్లించింది.  ప్రపంచంలోనే ధనవంతుడు వారెన్ బఫెట్ కూడా వాటా ఉన్న బీవైడీ ఇండియా మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా వుంది. ఇప్పటికే కార్లతో సహా వివిధ రకాల వాహనాలను ప్రపంచ మార్కెట్లో ప్రవేశపెట్టిన బీవైడీ దేశీయ మార్కెట్లోకి వ్యాన్లను కూడా త్వరలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నది. ఇదీ బీవైడీ చరిత్ర. ఇంత పెద్ద కంపెనీతో గోల్డ్స్టోన్ ఇన్ఫ్రాటెక్గా ఉన్నప్పుడే ఒప్పందం కుదిరింది. ఇది మేఘా కృష్టారెడ్డీ కొత్తగా లింకెట్టింది కాదు. .


Trying out the new QuidProco file?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎపిలో నేటి నుంచి వైఎస్ఆర్ నవోదయం పధకం..
గెలుపు అనివార్యమంటున్న గులాబీదళం... కేసీఆర్ సభకు సన్నర్ధం
ససేమిరా అంటున్న కేసీఆర్.. పట్టుబిగిస్తున్న ఆర్టీసీ జేఏసీ
గ్రీన్ లంగ్‌స్పేస్‌ల ఏర్పాటుకు చర్యలు..
విరుద్ధంగా కేటాయింపులు.. అందుకే రద్దు చేశాం..
మొత్తానికి బోటు ఆచూకీ దొరికిందా..
మత్స్యకారులకు రూ.100కోట్లతో డీజిల్‌ బంకుల ఏర్పాటు
వ్యవస్థను నాశనం పట్టించారు...టిఎఏ మద్దతు కోరిన ఆర్టీసీ జేఏసీ
ఉద్యమరూపం దాల్చిన ఆర్టీసీ సమ్మె.సామూహిక దీక్షల్లో సిపిఐ ..
భర్తను గోతునులిమి చంపిన భార్య..
మరిన్ని సంక్షేమ పథకాలు అమలే అజెండాగా. మంత్రివర్గం భేటీ
ఆయన అడుగు పెడితే ప్రకృతి కూడా పులకరిస్తుంది.
48 గంటల పాటు మంచినీటి స‌ర‌ఫ‌రా బంద్
ఆ చర్చలకు..15 సంవత్సరాలు..
ఇది నిజమేనా..ఆయన దరిద్రం వల్లే ఇన్నాళ్లు నిండలేదా
ప్రభుత్వ ఉద్దేశం తెలిస్తే సమస్య పరిష్కారమయ్యేది.
లోయలోపడిన పర్యాటకుల బస్సు..పది మంది దుర్మరణం..
ప్రభుత్వంలో కదలిక వచ్చినట్టుందే
ఆద్యంతం వీనుల విందుగా సిరిమానోత్సవం..
తప్పని సరి పరిస్థితుల్లో పొత్తు వెనక్కి..
వై ఎస్ పాలన తిరిగి మొదలైందిగా..
వాళ్ళ తాటాకు చప్పుళ్లకు భయపడను..
జగనన్న ముద్ర ఉండేలా.. విద్య మంత్రి పాఠాలు
ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే వస్తాం..
ఆర్టీసీ ప్రభుత్వ విలీనంతోనే వారికీ ఆత్మకు శాంతి
45 ఏళ్ల కుర్రోడి దెబ్బకు ఆయన మైండ్‌ బ్లాక్‌..
తెల్ల కార్డు కుటుంబానికే కొండంత అండ..
అక్టోబరు15 నుంచి పంటధాన్యాల కోనుగోలు కేంద్రాలు..
సందడి చేయాల్సింది పోయి బేజారయ్యారు..
హుజూర్ నగర్ బై పోరుకు సర్వం సిద్ధం..
సమస్యేదైనా పరిష్కరిస్తా..ఎన్‌ఆర్‌ఐలతో వైవీ
రాజకీయ శక్తుల చేతిలోకి ఆర్టీసీ సమ్మె..
అభిమానులు గర్వపడేలా నా కొత్త సినిమా
ఎన్ సిసితో నైపుణ్యం అభివృద్ధి..
పారదర్శక పాలనలో వైఎస్‌ జగన్‌ మరో అడుగు
పర్యాటకులకు గొప్పగా ఆతిధ్యం..ఆ హోటల్స్ ప్రత్యేకత
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.