ఐదేళ్లకు లేదంటే పదేళ్లకో అధికారం చేతులు మారడం సహజమే.  అధికారం చేతులు మారినప్పుడల్లా గతంలో తమకు ఇబ్బందులు కలిగించారనే నెపంతో అధికారంలోకి వచ్చిన తరువాత  అధికారాన్ని అడ్డుపెట్టుకొని పగ సాధించడం అన్నదిమంచిది కాదు.  ఏదో చేస్తామని, అన్ని చేస్తామని అధికారంలోకి వచ్చి ఏమీ చేయకుండా ఉంటడం కూడా మంచిది కాదు.  ప్రజలు ఆశలు పెట్టుకొని ఓట్లు వేస్తె.. దానిని పక్కన పెట్టి సొంతలాభం కోసం చూసుకోవడం అన్నది కూడా మంచి పద్దతి కాదు. 

ఇది తెలుగుదేశం పార్టీ చేస్తున్న వ్యాఖ్యలు.  ప్రజలు ఏవో చేస్తారని చెప్పి వైకాపా 151 స్థానాలు ఇచ్చారని ఇప్పుడు కేవలం తమపై కక్ష ను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు.  తమపై కక్ష కట్టడం వలన ఉపయోగం లేదని, ప్రజలకు మంచి పనులు చేయాలనీ సూచించారు.  ఇప్పటికైనా ప్రభుత్వం అలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలని  పేర్కొన్నారు.  మంచి చేస్తేనే ప్రజలు రేపు ఓట్లు వేస్తారని తెలుగుదేశం పార్టీ అంటోంది.  


రాజధాని అభివృద్ధిని పక్కన పెట్టారని, రాజధాని విషయంలో ఇప్పుడు పనులు ఎక్కడికక్కడే ఆగిపోవాయని, సమయం, ధనం వృధా అవుతుందని అంటున్నారని టీడీపీ విమర్శలు చేసింది.  అభివృద్ధి వికేంద్రీకరణ అంటున్నారుగాని, దానికి సంబంధించిన విజన్ ప్లాన్ ఏంటో చెప్పడం లేదని, వికేంద్రీకరణ పేరు చెప్పి సమయం వృధా చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు.  టిడిపిపై కేసులు పెట్టడం, టిడిపిపై విమర్శలు చేయడంతోనే వైకాపా కాలక్షేపం చేస్తుందని అన్నారు.  


రివర్స్ టెండర్లు పేరుతో తమకు నచ్చిన ఒక్క కంపెనీకి పోలవరం ప్రాజెక్ట్ ను ధారాదత్తం చేసారని,  ప్రస్తుతం పెరుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని, పనులు ప్రారంభిస్తే.. కోట్ చేసిన డబ్బు సరిపోదని, తప్పని సరిగా మళ్ళీ పెంచాల్సిన అవశ్యకత వస్తుందని టిడిపి నాయకులూ ఆరోపిస్తున్నారు.  రాజధాని విషయంలో జగన్ లక్ష్యం ఏంటి అన్నది ఇప్పటి వరకు స్పష్టంగా తెలియడం లేదు.  ఎందుకంటే రాజధానిలో నిర్మాణాలను ఆపేస్తే దానివలన కేవలం నిర్మాణ సంస్థలకే కాదు, అటు పెట్టుబడులపై కూడా దాని ప్రభావడం పడుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: