పాకిస్తాన్ లో 40వేలమంది ఉగ్రవాదులు ఉన్నారని ఆ దేశమే స్వయంగా ఒప్పుకుంది.  పాక్ లో ఉన్న ఉగ్రవాదులకు ఆ దేశం సహాయ సహకారాలు అందిస్తోందని ఆ దేశానికీ చెందిన మంత్రులే స్పష్టం చేస్తున్నారు.  పైగా ఆదేశంలో వాళ్ళు పెంచి పోషిస్తున్న ముష్కరులే వారి దేశంలో విధ్వంసం సృష్టిస్తున్నారు.  ఆ విషయం అందరికి తెలిసిందే.  పాక్ నుంచి ఆక్రమిత కాశ్మీర్ ద్వారా ఇండియాలోకి ఉగ్రవాదులను సైన్యం సహాయంతో ఇండియాలోకి పంపించి ఇండియాలో అలజడులు సృష్టించాలని చూస్తున్నది పాకిస్తాన్ అనే సంగతి తెలుసు.  


పాక్ ఆల్ ఖైదా ఉగ్రవాదులు ట్విన్ టవర్స్ పై దాడి చేసిన సంగతి తెలుసు.  ఆల్ ఖైదా ముఖ్యనేత లాడెన్ పాక్ లోనే 10 ఏళ్లకుపైగా తలదాచుకున్నాడు.  పాక్ లో లాడెన్ ఉంటున్నట్టుగా పాక్ తెలియకుండా ఉంటుందా.. అలానే మసూద్ అహ్మద్, దావూద్ ఇబ్రహీం ఇలా ఎందరో నేరగాళ్లు, ఉగ్రవాదులకు ఆ దేశం ఆశ్రయం ఇస్తోంది.  ఆ దేశం భవిష్యత్తు అక్కడి నాయకుల చేతుల్లో లేదు.  


అక్కడి ఆర్మీ, ఆర్మీ అధికారుల చేతుల్లో మాత్రమే ఉన్నది అన్నది సత్యం.  ఆర్మీ చెప్పినట్టుగా అక్కడి ప్రభుత్వాలు నడుస్తాయి.  కాదు కూడదు అంటే ప్రభుత్వం పడిపోతుంది.  దురాక్రమంగా ఆక్రమించుకున్నా ఎవరూ ఏమి అనలేని పరిస్థితి వస్తుంది.  కాగా, జమ్మూ కాశ్మీర్ విషయంలో పాక్ ఒంటికాలిపై లేవడం నుంచి పీవోకే విషయంలో ఇండియాపై కంప్లైంట్ చేస్తూ వస్తున్నది పాక్.  


దీంతోపాటు పాక్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ట్విన్ టవర్స్ దాడి తరువాత పాక్ అమెరికాతో చేతులు కలిపి తప్పు చేసిందని చెప్పింది.  ఒకవేళ పాక్ ఉగ్రవాదంపై పోరు అనే అంశంలో అమెరికాతో చేతులు కలపకపోయి ఉన్నట్లయితే.... ఏం జరిగి ఉండేది.. పాక్ లో ఉగ్రవాదుల ఏరివేతకు అమెరికా డైరెక్ట్ గా రంగంలోకి దిగేది.  ఫలితంగా ఇప్పుడు పాక్ ప్రపంచ పటంలో అస్తవ్యస్తంగా మారిపోయి ఉండేదేమో.  ఆఫ్ఘన్ లో అమెరికా ఆర్మీ ఎలాగైతే ప్రవేశించిందో అలానే పాక్ లో ప్రవేశించి ఉండేది అనడంలో సందేహం అవసరం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: