సాంకేతికంగా ప్రపంచం అభివృద్ధి చెందిన తరువాత దూసుకుపోతున్నది. ఎన్నో విషయాల్లో దూసుకుపోతున్నది.  ప్రపంచ దేశాలతో పోటీపడుతున్నది.  ఇప్పటికే ఇండియా అన్ని రంగాల్లో ముందు ఉండేందుకు తాపత్రయ పడుతున్న సంగతి తెలిసిందే.  అంతేకాదు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో కూడా ఇండియా ముందు వరసలో ఉన్నది.  వాట్సాప్ వంటి వాటిని వినియోగించుకోవడంలో కూడా ఇండియా ముందు ఉన్నది.  


వాట్సాప్ మెసేజ్ యాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రపంచం చాలా చిన్నదైంది.  చిన్న ప్రపంచంలో ఎక్కువ పరిజ్ఞానం దాగుంది. సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరికి అన్ని హంగులు అందుబాటులోకి వచ్చాయి. నచ్చిన విధంగా ఫోటోలు దిగడం స్టేటస్ లు పెట్టడం షరా మామూలైంది.  అంతేకాదు, ఎవరికి తోచిన విధంగా వారు స్టేటస్ మెసేజ్ లు కూడా పెడుతున్నారు.  ఒక్కోసారి అలాంటి మెసేజ్ లు ప్రాణాలమీదకు తీసుకొస్తాయి.  


ఇలాంటి ఇబ్బందే ఇప్పుడు ఓ విషయంలో జరిగింది.  దక్షిణ కర్ణాటకలోని ఉలాల్లా జిల్లాలోని కిలంజూర్ అనే ప్రాంతంలో ఇర్షాద్ అనే యువకుడు రాజకీయాలకు సంబంధించిన ఓ స్టేటస్ ను పెట్టాడు.  ఈ స్టేటస్ సరదాగా కోసం పెట్టుకున్నాడు.  కానీ, అది ఆ యువకుడి ప్రాణాలమీదకు తీసుకొస్తుందని అనుకోలేదు.  ఇర్షాద్ వాట్సాప్ స్టేటస్ కు స్థానికంగా ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకుడు స్పందించాడు.  వెంటనే ఇర్షాద్ ఉన్న చోటుకు వచ్చి హడావుడి చేశాడు.  


గన్ తో గాల్లోకి కాల్పులు జరిపాడు.  అక్కడితో ఆగలేదు.  రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపిన తరువాత మూడో రౌండ్ కాల్పులు అనుకోకుండా ఇర్షాద్ పై జరిపాడు.  ఇర్షాద్ కాలికి గాయం అయ్యింది.  అర్ధరాత్రి కాల్పులు శబ్దం రావడంతో.. చుట్టుపక్కల వాళ్ళు పరుగు పరుగున అక్కడికి వచ్చారు.  అక్కడికి వచ్చిన వెంటనే... ఇర్షాద్ పై కాల్పులు జరిపిన వ్యక్తులను చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: