ఐరాస సభల్లో పాల్గొనేందుకు ప్రపంచదేశాలు ఐరాస కు చేరుకున్నారు.  ప్రముఖ దేశాలు అమెరికా అధ్యక్షుడితో సమావేశం జరుపుతున్నారు.  ఆయా దేశాలు అమెరికాతో ఉన్న అనుబంధం గురించి చర్చలు జరుపుతున్నారు.  తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చర్చలు జరుపుతున్నారు.  ట్రంప్ మీటింగులతో బిజీ బిజీ అయ్యారు.  ఇదిలా ఉంటె, నిన్నటి రోజున ఇమ్రాన్ ఖాన్ ట్రంప్ ను కలిశారు. ట్రంప్ తో చర్చలు జరిపారు.  


ట్రంప్ తో ఇమ్రాన్ చర్చలు జరపడానికి ప్రధాన కారణం ఉన్నది.  జమ్మూ కాశ్మీర్ విషయంలో ఇండియా అనుసరిస్తున్న విధానం.. జమ్మూ కాశ్మీర్ విషయంలో ఇండియాపై ఒత్తిడి, కాశ్మీర్ అంశంలో అమెరికా జోక్యం వంటివాటిపై చర్చించేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ మీడియా సమావేశంలో అనేక విషయాలు గురించి చర్చించారు.  


అయితే, ట్రంప్ తో జరిపిన మీడియా సమావేశంలో ట్రంప్ కొన్ని విషయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.  కాశ్మీర్ విషయంలో తాను మధ్యవర్తిత్వం విషయంలో రెడీ గా ఉన్నానని, కానీ, ఇండియా కోరుకుంటూనే మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పారు.  ఇది ఇమ్రాన్ ఖాన్ కు మింగుడు పడలేదు.  పైగా జమ్మూ కాశ్మీర్ విషయం ఇండియా అంతర్గత విషయం అని మరోసారి ట్రంప్ స్పష్టం చేశారు.  అక్కడితో ఆగలేదు.. మోడీ ప్రభుత్వం పనితీరు బాగుందని, మోడీ స్ట్రాంగ్ లీడర్ అని చెప్పడంతో పాపం ఇమ్రాన్ ఖాన్ కుదేలయ్యారు.  


పాక్ తీరు సరిగా ఉండటం లేదని చెప్పడంతో పాపం పాక్ కు ఏం చేయాలో తోచలేదు.  ఇమ్రాన్ మంచి లీడర్ అని చెప్పడం ఆయనకు కొంత ఊరటను కలిగించింది.  ఇండియాకు ఇమ్రాన్ ఇప్పటికే బహిరంగంగా మద్దతు తెలిపారు.  ఉగ్రవాదంపై కలిసి పోరాటం చేద్దామని అన్నారు.  ఉగ్రవాదం విషయంలో అమెరికా ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటుందని పేర్కొన్న సంగతి తెలిసిందే.  ఇలాంటి సమయంలో పాక్ అమెరికాను కలిగి మద్దతు కూడగట్టాలి అంటే సాధ్యం అయ్యే విషయమేనా చెప్పండి.  


మరింత సమాచారం తెలుసుకోండి: