తెలంగాణ‌లో స‌ర్కారు వైద్యం ఎలా ఉందో నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది ఈసంఘ‌ట‌న‌. ప్ర‌భుత్వ దావాఖానాల్లో ప్ర‌భుత్వ వైధ్యాధికారులు ప్రైవేటు క్లినిక్‌లు ఓపెన్ చేసుకుని సొమ్ము చేసుకోవ‌డానికే ప్రాధాన్య‌త ఇస్తూ ప్ర‌భుత్వ వైధ్యానికి గాలికొదిలేస్తున్నార‌డానికి ఇది ఓ మ‌చ్చుతునక‌. ఆస్ప‌త్రిలో ఉండాల్సిన డాక్ట‌ర్లు విధుల‌కు డుమ్మా కొట్ట‌డం, డాక్టర్ల‌కు బ‌దులు స్టాఫ్ న‌ర్సులే డాక్ట‌ర్ల అవ‌తార‌మెత్తడం తెలంగాణ‌లోని అన్ని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో జ‌రుగుతున్న తంతే.


ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో వైద్యులు అందుబాటులో ఉంటున్నారేమో కానీ, ప‌ల్లె ప్రాంతాల్లో ఉన్న ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో మాత్రం వైద్యులు రారు. .. పేద‌ల‌కు వైద్యం అంద‌దు. అని నిరూపించే సంఘ‌ట‌న ఇది. ఓ పండంటి బిడ్డ‌కు జన్మ‌నిస్తాన‌ని క‌ల‌లుగ‌న్న ఓ నిండుగ‌ర్భిణికి పుత్ర‌శోఖం పురిట్లోనే చిదిమేసిన హృద‌యం ద్ర‌వించిపోయే సంఘ‌ట‌న తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో చోటు చేసుకుంది.


ఓ స్టాఫ్ న‌ర్స్ నిండు గ‌ర్భిణికి ఆఫ‌రేష‌న్ చేయ‌డంతో అది విక‌టించి పురిట్లోనే శిశువును చంపేసింది.. ఇది ఇప్పుడు తెలంగాణ వైద్య రంగాన్నే ప్ర‌శ్నిస్తుంది. తెలంగాణ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో 24 గంట‌ల ప్ర‌సూతి ఆస్ప‌త్రి ఉంది. ఇందులో డ్యూటీ డాక్ట‌ర్లు, సిబ్బంది నిత్యం ఉండాలి. అయితే ఇక్క‌డ డాక్ట‌ర్లు ఉండ‌కుండా కేవ‌లం కొంద‌రు స్టాఫ్ న‌ర్సుల‌తోనే నెట్టుకొస్టున్నారు. మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు సైతం చూసిచూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో ప్ర‌భుత్వ హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యానికి పసిగుడ్డు బలైపోయింది.


అమ్మ కడుపులోంచి బైటకు రాకుండానే మృతి చెందింది. తొమ్మిది నెలలు అమ్మ కడుపులో పెరిగి బైట ప్రపంచాన్ని చూడకుండానే కన్ను మూసింది. జ‌న‌గామ జిల్లా పాల‌కుర్తి  యూపీహెచ్‌సీలో ప్రసవానికి  పాల‌కుర్తి మండ‌లం ఈర‌వెన్ను గ్రామానికి చెందిన‌  ఓ గర్భిణి వచ్చింది. హాస్పిటల్ లో డాక్టర్లు లేరు. దీంతో  స్టాఫ్ నర్సులే ఆమెకు ఆపరేషన్ చేసేశారు. దీంతో ఆపరేషన్ వికటించింది. శిశువు మృతిచెందింది. చేతకాని పనులతో ప్రాణాలతో చెలగాటం ఆడుతూ వీరు చేసిన ఈ పనికి పసిగుడ్డు ప్రాణాలు కోల్పోగా తల్లి పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు సమాచారం.


దీంతో గర్భిణి బంధువులు సిబ్బంది నిర్లక్ష్యానికి నిరసిస్తూ..హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలనీ..తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత జ‌రుగుతున్నా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు క‌నీసం స్పందించ‌క‌పోవ‌డం విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: