రజినీకాంత్ ఏది చేసిన అదొక సంచలనంగా మారుతుంది.  68 సంవత్సరాల వయసులో కూడా రజినీకాంత్ చాలా యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు.  వరసగా సినిమాలు చేస్తూ బిజీ అయ్యాడు.  సినిమా రంగంలో బిజీగా ఉంటూనే.. అటు రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని చూస్తున్నాడు.  గత రెండు దశాబ్దాలుగా రజినీకాంత్ సినిమాల్లోకి వస్తారనే వార్తలు వస్తున్నాయి.  వార్తలైతే వస్తున్నాయిగాని, ఆ దిశగా మాత్రం అడుగులు పడటం లేదు.  దీంతో రజినీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేది లేదని చాలామంది అనుకున్నారు.  


అమ్మ మరణించిన తరువాత రాజకీయాల్లో మళ్ళీ అలజడి మొదలైంది.  రజినీపై అభిమానులు ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారు.  అభిమానుల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో రజినీకాంత్ రాజకీయాలకు సంబంధించిన వ్యాఖ్యలు చేశారు.  రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకరించారు.  అభిమాన సంఘాలు కాస్త ప్రజా సంఘాలుగా మారిపోయాయి.  ప్రజా సంఘాలుగా మారడంతో రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఎదుర్కోవాలని ఆలోచనలో పడ్డాయి ఆయా పార్టీలు.  


కానీ, అనూహ్యంగా రజినీకాంత్ పార్టీ పేరును గాని,ప్రజల్లోకిగాని వెళ్ళలేదు.  దీంతో రజినీకాంత్ ఇలాగే చెప్తుంటాడు రాజకీయాల్లోకి రారు అని వార్తలు వినిపించాయి.  2021లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు రాబోతున్నాయి.  దర్బార్ సినిమా తరువాత సినిమాలకు దూరంగా ఉండి రాజకీయాల్లోకి వెళ్లాలని చూస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.  ఇందులో ఎంతవరకు నిజం ఉండనే విషయం పక్కన పెడితే.. ఈ సినిమా తరువాత శివ తో కూడా సినిమా చేయాల్సి ఉన్నది.  శివ పొలిటికల్ డ్రామాతో కూడిన కథను సిద్ధం చేశారని.. అదే ఆఖరు సినిమా అవుతుందని అంటున్నారు.  


ఇప్పుడు రజినీకాంత్ ముంబై వెళ్లి అక్కడ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను కలిశారు.  ఇద్దరు కలిసి చాలాసేపు చర్చలు జరిపారు.  దీంతో మళ్ళీ తమిళనాడు రాజకీయాల్లో కలకలం మొదలైంది.  రాజకీయాల్లోకి వచ్చేందుకు రజినీకాంత్ రెడీ అవుతున్నారని, అందుకే పీకేని రాజకీయ వ్యూహకర్తగా తీసుకుంటున్నారని సమాచారం.  ఇది రజిని అభిమానులు ఆనందించదగిన విషయమైతే.. తమిళనాడు ప్రధాన పార్టీలైన అన్నా డీఎంకే, డీఎంకే పార్టీలకు మింగుడుపడని విషయమని చెప్పాలి.  ఏది ఏమైనా రజినీకాంత్ పార్టీ పేరును అనౌన్స్ చేసి రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించే వరకు వేచి ఉండక తప్పదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: