సియాచిన్ గ్లేసియర్.. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న సైనిక స్థావరం.  అక్కడ మన సైనికులు చలికి తట్టుకొని బోర్డర్లో పహారా కాస్తుంటారు సైనికులు.  నిత్యం చలిగాలులు వీస్తున్నాయి.  మంచు దట్టంగా కురుస్తుంది.  మంచు పెళ్లలుగా విరిగిపడుతుంటతుంది.  ఎన్ని విపత్కరమైన పరిస్థితులు ఏర్పడినా సైనికులు మాత్రం వదలకుండా పహారా కాస్తుంటారు.  ఇలాంటి గ్లేసియర్ లో ఇప్పుడు చెత్త దారుణంగా పేరుకొని ఉన్నది.  


చాలాకాలంగా అక్కడ చెత్తపేరుకొని పోయి గుట్టలుగా మారడంతో దానిని తొలగించే పనిలో పడిపోయింది ఆర్మీ.  దాదాపు 236 టన్నులకు పైగా చెత్త అక్కడ పేరుకుపోయి ఉన్నది.  ఆ స్థాయిలో పేరుకుపోయిన చెత్తను తొలగించడం అంటే మాములు విషయం కాదు.  ఆర్మీ మెగాడ్రైవ్‌ చేపట్టి స్థానికులు, లేహ్‌ ప్రజలకు పర్యావరణంపై అవగాహన కల్పిస్తోంది. దాదాపు ఏడాదిన్నర క్రితం ఈ డ్రైవ్‌ చేపట్టగా.. ఇప్పటి వరకు 130 టన్నుల చెత్తను తొలగించారు. చలికాలంలో ఇక్కడి ఉష్ణోగ్రతలు మైనస్‌ 60 డిగ్రీలకు పడిపోతుంటాయి. వాతావరణం ఇంత చల్లగా ఉండటం వల్లే ఇక్కడ చెత్త భూమిలో కలిసిపోదు. ఫలితంగా గుట్టలుగుట్టలుగా పేరుకుపోయింది. 


ఇంకా వంద టన్నులకు పైగా చెత్త పేరుకుపోయి ఉండటంతో మెల్లిగా తొలగిస్తున్నారు.  పైగా ఈ ప్రదేశం నుంచే ఇండియాలోకి చొరబడేందుకు కొంతమంది ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తుంటారు.  పాక్ ఆర్మీ కూడా ఈ ప్రదేశం నుంచి ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తుంటుంది.  అటు చైనా కూడాతో ఇండియాకు ఇటువైపు నుంచే ఇబ్బందులు ఉన్నాయి.  


ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు చైనాల నుంచి వస్తున్న ముప్పును తట్టుకొని ఇండియన్ ఆర్మీ పని చేస్తుంటారు.  ఎన్ని ఇబ్బందులు తలెత్తినా సరే మొక్కవోని ధైర్యంతో పహారా కాస్తుంటారు.  అసలే ఇప్పుడు ఇండియా, పాక్ దేశాల మధ్య పచ్చగడ్డి వస్తే భగ్గుమనేలా ఉన్నది.  ఈ సమయంలో  సరిహద్దులో దళాలు నిత్యం అప్రమత్తంగా ఉంటున్నాయి.  ఏ మాత్రం వేమరుపాటుగా పాక్ సైన్యం విరుచుకుపడే అవకాశం ఉంటుంది.  ఆ అవకాశాన్ని ఇండియా ఇచ్చేందుకు సిద్ధంగా లేదు.  


ఒకవైపు పహారా కాస్తూ.. మరోవైపు పర్యావరణానికి ముప్పు కలిగించే చెత్తను తీసేస్తూ ఇండియన్ ఆర్మీ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.  ఇప్పటి వరకు ఇండియన్ ఆర్మీ, అక్కడి స్థానికులకు మాత్రమే అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఉన్నది.  కానీ, ఇకపై పర్యాటకులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.  త్వరలోనే పర్యాటకులు కూడా సియాచిన్ వాతావరణాన్ని వీక్షించే అవకాశం ఉంది.  అయితే, సియాచిన్ ను క్లీన్ గా ఉంచితేనే పర్యాటకులకు అనుమతి ఇస్తారట.  


మరింత సమాచారం తెలుసుకోండి: