హైదరాబాద్ ప్రాంతంలో కొత్త రకం మోసం వెలుగు చూసింది. ఒక ఘరానా లేడీ బాగోతం ఈరోజు వెలుగులోకి వచ్చింది. బీఎస్సీ చదివిన యువతి ఫేస్ బుక్ నుండి పోటోలు సేకరించి స్కూల్ యాజమాన్యాలను బ్లాక్ మెయిల్ లకు పాల్పడుతుంది. హైదరాబాద్ నగరంలో ప్రముఖ పాఠశాలల నుండి ఈ యువతి అమ్మాయిల మరియు అబ్బాయిల ఫోటోలను ఫేస్ బుక్ నుండి డౌన్ లోడ్ చేసుకొనేది. 
 
ఆ తరువాత ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా చిత్రీకరించి ఆ తరువాత స్కూల్ యాజమాన్యాలకు ఫోన్ చేసి  సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పరిచయం చేసుకొని డబ్బులు డిమాండ్ చేసేది. హైదరాబాద్ లో నాలుగు ప్రముఖ పాఠశాలల యాజమాన్యాలను యువతి ఈ విధంగా బెదిరించిందని తెలుస్తోంది. ఒక పాఠశాల యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి యువతిని పట్టుకున్నారు. 
 
పోలీసులు నిందితురాలి మొబైల్ లో 220 కు పైగా స్కూల్ యాజమాన్యాల వాట్సాప్ గ్రూపులు ఉన్నట్లు గుర్తించారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో యువతి ఈ విధంగా చేసినట్లు సమాచారం. పాఠశాల యాజమాన్యాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, టీచర్ల యొక్క ఫోటోలను యువతి మార్ఫింగ్ చేసినట్లు తెలుస్తోంది. 
 
ఆ ఫోటోలను ఆన్ లైన్లో పెట్టి డబ్బులు ఇస్తే మాత్రమే ఆ ఫోటోలు డిలేట్ చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. 225 స్కూల్స్ ను ఈ యువతి టార్గెట్ చేసిందని సమాచారం. 20 రోజుల నుండి ఈ యువతి ఇలా చేస్తుందని సమాచారం. సైబర్ క్రైమ్ పోలీసులు సోషల్ మీడియాలో గ్రూప్ లో ఉన్నవారు మాత్రమే చూసేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వీలైతే పాఠశాల యాజమాన్యాలు ఫోటోలు అప్ లోడ్ చేయవద్దని, ఒకవేళ చేసినా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. టీచర్లు, తల్లిదండ్రుల ఫోటోలు మాత్రమే మార్ఫింగ్ చేసిందని విద్యార్థులవి చేయలేదని పోలీసులు చెబుతున్నారు. 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: