కృష్ణా కరకట్టపై నివాసం ఉంటున్న చంద్రబాబు ఇంకా ఎందుకు అక్కడ ఉంటున్నాడో అర్థం కావడం లేదట‌... కరకట్టపై చంద్రబాబు తన నివాసాన్ని వెంటనే ఖాళీ చేయాలట‌... ఆ నిర్మాణాన్ని ప్రభుత్వం కూల్చి వేస్తే చంద్రబాబు సానుభూతి పొందాలని చూస్తున్నారట‌.. చంద్ర‌బాబు సానూభూతి కోసం పాకులాడుతున్నాడ‌ట‌.. ఇది ఎవ‌రో అన్న‌మాట కాదు.. టీడీపీ అధినేత చంద్రాబాబు న‌మ్మిన‌బంటు.. ప్ర‌స్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి నోటివెంట వ‌చ్చిన చిలుక ప‌లుకులు.. ఇప్పుడు సుజ‌నాచౌద‌రి చేసిన ఈ కామెంట్లు రాజకీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి. ఇంకా సుజ‌నా చౌద‌రి నోటి వెంట చంద్ర‌బాబు ప‌లుకులే వినిపించ‌డం ఆశ్చ‌ర్య‌మే. ఎందుకంటే బీజేపీలో మ‌నిషిగా ఉండి.. మ‌న‌స్సంతా చంద్ర‌బాబుతోనే ఉంద‌నే విధంగా మాట్లాడిన తీరు స్ప‌ష్టం చేస్తుంది..


వైసీపీ ప్రభుత్వ పాలన చేస్తున్న ఈ నాలుగు నెల‌ల్లో ప్రజాస్వామ్యబద్ధంగా లేదట‌. రివర్స్ టెండరింగ్ తో పోలవరం పనుల్లో కాలయాపన చేస్తున్నారట‌. టెండర్ల విషయంలో కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) మార్గదర్శకాలను పాటించడం లేద‌ని సుజ‌నా చౌద‌రి అన‌డం చూస్తుంటే అచ్చు చంద్ర‌బాబు బంట్రోత్ మాట్లాడిన మాట‌ల్లాగే ఉన్నాయ‌ని రాజ‌కీయ ప‌రిజ్ఞానం ఉన్న ప్ర‌తి ఒక్క‌రికి అర్థ‌మ‌వుతుంది. రివ‌ర్స్ టెండ‌రింగ్‌తో గ‌త కాంట్రాక్ట‌ర్ ఎందుకు రేటు త‌గ్గించి టెండ‌ర్ వేసాడో చెప్పాల‌ని సుజ‌నా ప్ర‌శ్నించ‌డం విడ్డూరంగా ఉంది. ఇక  విద్యుత్ రంగంలో పీపీఏల ర‌ద్దుతో ఏపీకి ప‌రిశ్ర‌మ‌లు రావ‌ట‌.. అంతే కాద‌ట‌.. దేశానికే చెడ్డ‌పేరు వ‌స్తుంద‌ట‌..


మ‌రి పీపీఏల ర‌ద్దుతో ఇంత రాద్దాంతం జ‌రుగుతుందా... కేవ‌లం ఒక ఏపీ రాష్ట్రంలో పీపీఏలు ర‌ద్ద‌యితే మొత్తం దేశానికే ప్ర‌మాద‌మా.. ఇది నిజ‌మేనా సుజ‌నా చౌద‌రికి దేశంపై ఇంత ప్రేమ ఉందంటే న‌మ్మ‌వ‌చ్చా.. అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  వైఎస్ హయాంలో భూసేకరణ పూర్తయితే ఇంత సాగదీత ఉండేదికాదట‌. అంతేకాదు  ఉద్యోగాల కల్పనలోనూ వైసీపీ ప్రభుత్వం విఫలమైందని సుజ‌నా చౌద‌రి చెప్ప‌డం చూస్తుంటే ఎంత విడ్డూరంగా మాట్లాడుతున్న‌డో ఏపీ ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. ఇంకా సుజ‌నా చౌద‌రి ఓ గొప్ప విష‌యాన్ని ప్ర‌స్థావించి విస్మ‌యం క‌లిగించాడు.. ఏసీ సీఎం జ‌గ‌న్  పార్టీలు, కులాలు, మతాలుగా విభజించి పరిపాలన చేస్తున్నాడ‌ట‌. ఏపీ రాష్ట్రాన్ని నాశ‌నం చేస్తుంది జ‌గ‌న్ స‌ర్కార‌ట‌.. గ‌త ప్ర‌భుత్వం చేసిన ప‌నుల‌పై ఈ ప్ర‌భుత్వం శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ట‌.


అంతే కాదు ఏపీ ప్ర‌భుత్వం చంద్రబాబు ఇంటిచుట్టు రాజ‌కీయం చేస్తుంద‌ట‌.. చంద్రబాబు ఇంటి చుట్టూ రాజ‌కీయం తిప్పొద‌ని సుజ‌నాచౌద‌రి అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టి త‌న నైజాన్ని నిరూపించుకున్నాడు. సీఎం జ‌గ‌న్ ను తిట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకుని, చంద్రబాబు అద్దె  ఇంటిని కాపాడేందుకు సుజ‌నా చౌద‌రి ఆడుతున్న అద్దె డ్రామా అని అర్థం చేసుకోవ‌చ్చ‌ని ఏపీ ప్ర‌జ‌లు, రాజ‌కీయ నేత‌లు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.. ఏదేమైనా చంద్ర‌బాబు ఆత్మ‌గా సుజ‌నాచౌద‌రి త‌న న‌ట‌న సూప‌ర్‌గా ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: