యూత్ కు తొందర ఎక్కువ.  ప్రతి విషయంలో ముందు ఉండాలని చూస్తారు.  సాహసాలు చేయాలని చూస్తుంటారు.  సహాయం చేయడం అంటే వారికి మహా సరదా.  అందుకే ఆ సరదా కోసం అనేక సాహసాలు చేస్తుంటారు.  బస్సులోపల ఖాళీ ఉన్నా.. ఫుట్ బోర్డు పై నిలబడి ప్రయాణం చేయడం, కదిలే బస్సుల్లో నుంచి దిగడం..ట్రైన్స్ కోసం పరిగెత్తటం వంటివి చేస్తుంటారు.  ఇలా చేయడం వీరికి ఓ సరదా కావొచ్చు.  కానీ, ఈ సరదా కారణంగా ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే తల్లి దండ్రులకు శోకం మిగిల్చిన వాళ్ళు అవుతారు.  


ఇటీవలే గుజరాత్ లోని అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో ఓ యువకుడు కదులుతున్న రైల్ ఎక్కేందుకు ప్రయత్నం చేశాడు.  అప్పటికే ట్రైన్ స్పీడ్ మీద ఉన్నది.  పట్టుదారి కిందపబోయాడు.  అక్కడే ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది స్పందించి వెంటనే ఆ వ్యక్తిని ట్రైన్ లోపలికి నెట్టారు.  ఈ విషయాన్ని  రైల్వే మంత్రిత్వశాఖ ట్విట్టర్ లో షేర్ చేసింది.  యువకులు ఫిట్ గా ఉన్నారని అనుకోవడంలో తప్పులేదు.  కానీ, కదులుతున్న ట్రైన్ లో ఎక్కేందుకు ప్రయత్నించి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దు అని చెప్పి ట్వీట్ చేశారు.  


ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  చాలా మంది యువత ఇలానే చేస్తుంటుంది.  వారికి కనువిప్పు కావాలి.  మోటార్ వాహన చట్టం అమలులోకి వచ్చిన తరువాత రూల్స్ పాటించకుండా ఉంటె జరిమానాలు వేసినట్టుగా రైల్వే విషయంలో కూడా ఏదైనా కొత్త చట్టం తీసుకురావాలి.  అప్పుడే ఇలాంటి వాటిని అరికట్టవచ్చు.  రైల్వేశాఖ ఈ దిశగా ఆలోచిస్తే మంచిదేమో.  ఇలానే వదిలేస్తే .. మన యువత ఇలానే చేస్తుంది.  


కాబట్టి కొత్త చట్టం తీసుకొచ్చే విధంగా ఏదైనా ప్లాన్ చేయాలి.. లేదా ఇంకేదైనా నిర్ణయం తీసుకోవాలి.  ఒక్క అహ్మదాబాద్ లో మాత్రమే కాదు.. ఇలా చాలా చోట్ల జరుగుతున్నాయి.  విమర్శలు వస్తున్నాయి.  జాగ్రత్తలు తీసుకోవాలని ఎంతగా హెచ్చరించినా ప్రజలు మాత్రం అలానే చేస్తున్నారు.  ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు అలర్ట్ అయ్యారు కాబట్టి సరిపోయింది లేదంటే ఎంత ఘోరం జరిగిపోయేదో చెప్పక్కర్లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: