ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కన్నబాబు చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం రైతుల రుణాలతో పాటు డ్వాక్రా రుణాలను కూడా మాఫీ చేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక రైతులకు రుణమాఫీ కేవలం 15 వేల కోట్ల రూపాయలు మాత్రమే చేసారని కన్నబాబు ఆరోపణలు చేశారు. 
 
ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న సమయంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేకపోయారని కన్నబాబు చంద్రబాబుని ప్రశ్నించారు. రైతులకు 87 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి ఉండగా కమిటీలు వేసి రైతుల రుణమాఫీకి కోతలు విధించారని కన్నబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రుణమాఫీపై చర్చకు సిద్ధమా? అని కన్నబాబు సవాల్ విసిరారు. 
 
వైసీపీ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కొరకు ఎంతో చిత్తశుద్ధితో పని చేస్తున్నప్పటికీ అనవసరంగా వైసీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని కన్నబాబు అన్నారు. 2019 ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే సమయంలో హడావిడిగా జీవోను ఎందుకు విడుదల చేశారని కన్నబాబు ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు 14 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు సీఎం జగన్ పై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. 
 
చంద్రబాబు చేసే వ్యాఖ్యలకు ఎల్లో మీడియా వంత పాడుతుందని అంబటి రాంబాబు అన్నారు. అవినీతి రహిత పాలన అందించటం కొరకు సీఎం జగన్ నిరంతరం కృషి చేస్తున్నాడని అంబటి వ్యాఖ్యానించారు. దేవతలు యజ్ఞం చేస్తే రాక్షసులు ఆ యజ్ఞాన్ని అడ్డుకొన్నట్లు జగన్ మంచిపనులు చేస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని అంబటి రాంబాబు అన్నారు. ఎల్లో మీడియా చంద్రబాబు పిల్లిలా అరిచినా పులిలా అరిచాడని మొదటి పేజీలో వార్తలు రాస్తుందని అన్నారు. ఈరోజు తాడేపల్లిలో అంబటి రాంబాబు మీడియా సమావేశంలో పాల్గొని చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారు. 


 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: