ప్రపంచంలోని చాలా నగరాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.  ఒకటికాదు రెండు కాదు.. ప్రపంచంలో 45 నగరాల భవిష్యత్తు అంధకారంలో మునిగిపోయేలా కనిపిస్తోంది.  మంచు పర్వతాలు కరిగిపోవడంతో పాటు భూతాపం వేడి పెరిగిపోతుండటంతో.. మంచు కరిగి సముద్రాల్లోకి నీరు వచ్చి చేరుతున్నది.  ఈ నీరు కారణంగా సముద్రాల్లో నీటిశాతం పెరిగిపోతున్నది.  ఫలితంగా సముద్రాల ఒడ్డున ఉన్న నగరాల భవిష్యత్తు అంధకారంగా మారే విధంగా మారిపోయింది.  


 
ఇండియాలోని నాలుగు ప్రధాన నగరాలు కోల్ కతా, ముంబై, చెన్నై, సూరత్ నగరాల మనుగడ ప్రస్నార్ధకంగా మారబోతున్నది.  హిందూ కుష్  పర్వతాల్లో వేడి తీవ్రత పెరుగుతున్నది.  దీని ప్రభావం కారణంగా మంచు కరగడం మొదలైంది.  ఇలా మంచు కరిగిపోవడం వలన ఉత్తరాదిన తీవ్రమైన కరువు ఏర్పడే అవకాశం ఉంది.  అంతేకాదు, హిందూకుష్‌ హిమాలయ ప్రాంతంలో మంచుదిబ్బలపై భూతాపం పడినందువల్ల సముద్ర జలాల నీటి మట్టం పెరుగుతుందని ఐపీసీసీ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. సముద్రతీర నగరాల్లో సముద్ర జలాల నీటిమట్టం గణనీయంగా పెరుగుతుందని, దీంతో పాటు తుపాన్ల ప్రభావం పెరిగి భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. 


సముద్రంలో జల చరాలు, చేపల లభ్యత తగ్గుతుందని కమిటీ చెప్పింది. భారతదేశంలోని నాలుగు నగరాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 45 నగరాల్లో సముద్రజల నీటిమట్టాలు 50 సెంటీమీటర్ల మేర పెరుగుతాయని కమిటీ వివరించింది. హిమనీనదాలు కరిగిపోవడం వల్ల సముద్ర నీటిమట్టాలు శరవేగంగా పెరిగిపోతున్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే అండమాన్‌- నికోబార్‌, మాల్దీవులు వంటి వాటికీ అపారమైన నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది.  


అక్కడ ఆవాసం ఉండేందుకు కూడా అవకాశం ఉండకపోవచ్చు.  ముప్పును ముందుగానే గ్రహించి భూవాతారణం పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  అంతేకాదు, ముప్పు నుంచి బయటపడటానికి మొక్కలను పెంచాలి.  అడవులను నరికివేయడం వలనే ఇలాంటి ముప్పు వస్తున్నది అన్నది వాస్తవం.  కాబట్టి దీని నుంచి బయటపడటానికి వీలైనంతగా ప్రయత్నం చేయాలని పర్యావరణ వేత్తలు అభిప్రాయ పడుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: