ఒక‌ప్పుడు ప్ర‌త్య‌ర్థి పార్టీలో ఉన్న నేత‌లంతా ఇప్పుడు ఒకే పార్టీలో, ఒకే గొడుగు కింద‌కు వ‌చ్చేశారు. దీంతో ఒకే ఒర‌లో మూడు క‌త్తులు ఇమ‌డ‌టం క‌ష్టంగా మారింది. గ‌తంలో వివిధ పార్టీలో ఉన్న నేత‌లంతా ఇప్పు డు అధికార పార్టీ గూటికి చేర‌డంతో , వారి మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గంలో ఈ వింత ప‌రిస్థితి నెల‌కొంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోనే  త్రిముఖ పోరు కొన‌సాగుతోంది. నియోజ‌క‌వ‌ర్గంలో మూడు ముక్క‌లాట మొద‌లైంది.


తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఎ మ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గ‌తంలో ఇదే నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి పక్క నియోజకవర్గానికి వెళ్లిన ప్రస్తుత మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌ట్టి పట్టు ఉంది. అంతేగాక ఇక్కడి నుంచే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తోట త్రిమూర్తులుకు కూడా నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద సంఖ్య‌లో అనుచ‌రులు ఉన్నారు.


తాజాగా తోట త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, వైసీపీలో చేరారు. ఒకప్పుడు వీరంతా ప్ర‌త్య‌ర్థి  పార్టీల్లో ఉండగా..  ప్ర‌స్తుతం అంతా అధికార పార్టీలోకి వచ్చేశారు. గత రెండు దశాబ్దాలుగా ఈ ముగ్గురు లో ఏ ఇద్దరికీ పొస‌గ‌లేద‌నే చెప్పాలి.  పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు,  తోట త్రిమూర్తులుకు మ‌ధ్య ఏళ్లుగా రాజ‌కీయ వైరం ఉంది. రెండు వ‌ర్గాల మ‌ధ్య కూడా మొన్న‌టి వ‌ర‌కు ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేది. మ‌రోప‌క్క‌ ఐదునెలల క్రితం వరకు గురు శిష్యులుగా ఉన్న సుభాష్‌చంద్రబోస్‌, వేణుగోపాలకృష్ణ మ‌ధ్య ఎన్నికలు చిచ్చుపెట్టాయి.


బోసు నియోజవర్గంలో వేణు పాదం మోపడం ఆ వర్గానికి అస్సలు నచ్చలేదు. అందుకే వేణును ఓ డించాల‌ని గ‌ట్టిగా ప్ర‌య‌త్నించారు. కానీ జగన్ వేవ్‌ ముందు అవేమీ పని చేయలేదు.  తర్వాత మారిన ప రిస్థితుల మధ్య పిల్లి సుభాష్ చంద్ర‌బోసు, తోట త్రిమూర్తులు మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయన్న ప్ర‌చారం జరుగుతోంది. బ‌ద్ధ శ‌త్రువుల‌గా ఉన్న ఆ ఇద్దరు నేతలు త్వ‌ర‌లోనే క‌లిసే అవ‌కాశం ఉంద‌ని క్యాడ‌ర్‌లో చ‌ర్చ జ‌రుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: